యాప్నగరం

Saina Nehwal: ఆ లోటు తీరింది.. సైనా, సింధు ప్రదర్శనపై ‘సమయం’తో గోపీచంద్

ఏషియాడ్‌లో భారత స్టార్ షట్లర్లు సైనా, సింధు ప్రదర్శన పట్ల భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ సంతోషం వ్యక్తం చేశారు.

Samayam Telugu 27 Aug 2018, 4:53 pm
ఏషియాడ్‌లో భారత స్టార్ షట్లర్లు సైనా, సింధు ప్రదర్శన పట్ల భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ సంతోషం వ్యక్తం చేశారు. జకార్తా నుంచి ‘సమయం’తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. సైనా మెరుగైన ఆట కనబర్చిందన్నారు. ‘సుదీర్ఘ కాలంగా బ్యాడ్మింటన్ ఆడుతున్న సైనా ఇప్పటికే ఒలింపిక్స్, వరల్డ్ కప్, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్, ఏషియన్ ఛాంపియన్‌షిప్స్‌లలో పతకాలు సాధించింది. ఆసియా క్రీడల్లో మాత్రమే తను పతకం సాధించలేదు. ఆ లోటు ఇప్పటికి తీరింద’ని గోపీచంద్ తెలిపారు.
Samayam Telugu sindhu saian gopi


సింధు ప్రదర్శన పట్ల గోపీచంద్ ఆనందం వ్యక్తం చేశారు. ‘సింధు రెండో గేమ్‌లో ఓడినప్పటికీ.. ఏకాగ్రత కోల్పోలేదు. నిర్ణయాత్మక గేమ్‌లో తనెంతో బలంగా ఆడింది. వరల్డ్ నంబర్ 2ను ఓడించింద’న్నారు. రేపు ఫైనల్లో తై జు యింగ్‌తో పోరుకు సిద్ధంగా ఉండాలని గోపీచంద్ సూచించారు.

సోమవారం జరిగిన సెమీఫైనల్లో తై జు యింగ్ చేతిలో 17-21, 14-21 తేడాతో సైనా నెహ్వల్ ఓడిపోయింది. దీంతో కాంస్యాన్ని ఖాతాలో వేసుకుంది. ఏషియాడ్‌లో గత 36 ఏళ్లలో భారత్‌కు పతకం అందించిన షట్లర్‌గా సైనా అరుదైన ఘనత సాధించింది. మరో సెమీస్‌లో 21-17, 15-21, 21-10 తేడాతో యమగుచిపై విజయం సాధించిన సింధు ఫైనల్ చేరింది. తద్వారా ఆసియా కప్ ఫైనల్ చేరిన తొలి భారత బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా సింధు రికార్డ్ క్రియేట్ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.