యాప్నగరం

చైనీస్ తైపీ ఓపెన్ నెగ్గిన సౌరభ్ వర్మ

భారత బ్మాడ్మింటన్ స్టార్ సౌరభ్ వర్మ చైనీస్ తైపీ ఓపెన్ ఫైనల్లో మలేసియా ఆటగాడిపై విజయం సాధించి టైటిల్ గెలుపొందాడు.

TNN 16 Oct 2016, 5:57 pm
వరుస గాయాలతో చాలా కాలం ఆటకు దూరమైన సౌరభ్ వర్మ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. చైనీస్ తైపీ ఫైనల్లో మలేసియాకు చెందిన డారెన్ లీని ఓడించిన అతడు టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ గ్రాండ్ ప్రిక్స్ నెగ్గిన అతడికి 55 వేల డాలర్ల ప్రైజ్ మనీ లభించింది. మధ్యపద్రేశ్‌కు చెందిన 23 ఏళ్ల సౌరభ్..12-10, 12-10, 3-3తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా లీ వైదొలిగాడు. దీంతో విజయం వర్మను వరించింది. గతంలో బెల్జియం, పొలాండ్ ఇంటర్నేషనల్ ఛాలెంజర్లలో రన్నరప్‌త సరిపెట్టుకున్న సౌరభ్‌కు ఈసారి అదృష్టం కలిసి వచ్చింది. గాయాల కారణంగా అతడు దాదాపు ఏడాదిపాటు ఆటకు దూరంగా ఉన్నాడు. 2011లో నేషనల్ ఛాంపియన్‌గా అవతరించిన సౌరభ్ ఈ ఏడాది రన్నరప్‌గా నిలిచాడు.
Samayam Telugu badminton sourabh varma wins mens singles title at chinese taipei open
చైనీస్ తైపీ ఓపెన్ నెగ్గిన సౌరభ్ వర్మ

సౌరభ్ గేమ్‌ను బాగానే ప్రారంభించినప్పటికీ, తర్వాత లీ పుంజుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. కీలకమైన మూడో రౌండ్లో భుజం గాయం కారణంగా లీ మ్యాచ్‌ నుంచి వైదొలిగాడు. ముంజేతి గాయం కారణంగా ఏడాది కాలంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నా. కోలుకోవడానికి మూడు నెలలకు పైగా సమయం పట్టిందని సౌరభ్ చెప్పుకొచ్చాడు. 2015 మార్చి నాటికి టాప్-30లో ఉన్న సౌరభ్ వర్మ గాయం కారణంగా 190వ స్థానానికి పడిపోయాడు. త్వరలోనే తనదైన ఆటతీరుతో టాప్-40లోకి వస్తానని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.