యాప్నగరం

నల్లగా ఉందని అవమానిస్తే.. తెల్లబోయేలా చేసింది!

నల్లగా ఉందన్న కారణంతో ఓ బాలికపై టీచర్లు పక్షపాతం చూపించారు. జిమ్నాస్టిక్‌ చేయగలిగే సత్తా ఉన్నా..

TNN 7 Jul 2017, 8:12 pm
నల్లగా ఉందన్న కారణంతో ఓ బాలికపై టీచర్లు పక్షపాతం చూపించారు. జిమ్నాస్టిక్‌ చేయగలిగే సత్తా ఉన్నా.. ఆమెను పక్కనబెట్టారు. అదే తరగతిలో అందంగా ఉన్న మరో విద్యార్థిని ఎంపిక చేశారు. ఎలాగైనా మంచి గుర్తింపు సాధించి, అందరి ముందు గర్వంగా తలెత్తుకు తిరగాలని భావించిన ఆ బాలిక కసితో జిమ్నాస్టిక్స్‌ సాధన చేసింది. అసాధారణ ప్రతిభతో ఏకంగా జిమ్నాస్టిక్స్‌లో గిన్నిస్‌ రికార్డునే సాధించింది. బెంగళూరుకు చెందిన గిరీశ్, మంజుల దంపతుల కుమార్తె దీక్ష (8) గంట సమయంలోనే 2,776 ఫార్వర్డ్‌ రోలింగ్‌తో 4.5 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించింది. గతంలో అమెరికాకు చెందిన అశ్రితా ఫర్మాన్‌ చేసిన 1,330 ఫార్వర్డ్‌ రోలింగ్‌, 3.5 కిలోమీటర్ల రికార్డును తాజాగా ఈ బాలిక బద్దలు కొట్టింది.
Samayam Telugu bangalore girl deeksha girish guinness record in gymnastics
నల్లగా ఉందని అవమానిస్తే.. తెల్లబోయేలా చేసింది!


శుక్రవారం (జులై 7) బెంగళూరు నగర ప్రెస్‌క్లబ్‌లో.. తాను పొందిన గిన్నిస్‌ రికార్డు పత్రాన్ని దీక్ష సగర్వంగా ప్రదర్శించింది. ఈ సందర్భంగా వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ల సమక్షంలో.. ఆ బాలిక జిమ్సాస్టిక్స్‌లో ఫార్వర్డ్‌ రోలింగ్‌ను మరోసారి ప్రదర్శించింది. పలువురు ప్రముఖులు, ఆటగాళ్లు ఆమెను అభినందించారు. మరో 2 గిన్నిస్ రికార్డులపై దృష్టి సాధించినట్లు దీక్ష తెలిపింది.

తన కుమార్తె ఈ రికార్డు సాధించడానికి ప్రధాన కారణం పట్టుదలే అని చెబుతూ దీక్ష తండ్రి గిరీష్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘ప్రతిభను పట్టించుకోకుండా నా కూతురును అవమాన పరిచారు. ఎలాగైనా మంచి గుర్తింపు సాధించాలనే కసితో దీక్ష సాధన చేసింది. సుమారు ఏడాది పాటు కఠోర శిక్షణ ఇప్పించాం. గిన్నిస్‌ రికార్డు సాధించి ఇప్పుడు కర్ణాటక రాష్ట్రానికే గౌరవం తెచ్చింది’ అని ఆయన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.