యాప్నగరం

బాక్సింగ్ లెజెండ్ ముహమ్మద్ అలీ మృతి

ప్రముఖ బాక్సింగ్ లెజెండ్, ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ మాజీ ఛాంపియన్ ముహమ్మద్ అలీ ఇకలేరు.

Samayam Telugu 4 Jun 2016, 11:03 am
ప్రముఖ బాక్సింగ్ లెజెండ్, ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ మాజీ ఛాంపియన్ ముహమ్మద్ అలీ ఇకలేరు. శ్వాసకోస సంబంధిత సమస్యలతో గురువారం అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రం ఫీనిక్స్ సిటీ ఆస్పత్రిలో చేరిన అలీ అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1999లో స్పోర్ట్స్‌మెన్ ఆఫ్ ది సెంచురీ కిరీటాన్ని దక్కించుకున్న అలీకి ప్రపంచ ప్రముఖ క్రీడాకారులలో ఒకరిగా మంచి గుర్తింపుంది. కెంటకీలోని అలీ సొంత ఊరు లూయిస్ విల్లెలో అతడి అంత్యక్రియలు జరగనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
Samayam Telugu boxing legend muhammad ali dies at 74
బాక్సింగ్ లెజెండ్ ముహమ్మద్ అలీ మృతి


22 ఏళ్ల ప్రాయంలోనే మొదటిసారిగా వరల్డ్ హెవీ వెయిట్ టైటిల్ గెలిచిన అలీ తన కెరీర్‌లో 61సార్లు రింగులో తలపడగా అందులో 56సార్లు విజయం కైవసం చేసుకున్నారు. అత్యంత అధిక సంఖ్యలో విజయం సాధించిన ఎకైక స్పోర్ట్స్‌మెన్‌గానూ అలీకి గుర్తింపు వుండటం విశేషం. 1981లో బాక్సింగ్ నుంచి రిటైర్ అయిన అలీ ప్రస్తుత వయస్సు 74 ఏళ్లు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.