యాప్నగరం

షరపోవాకు తీపి కబురు

రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాకు తీపి కబురందింది.

TNN 4 Oct 2016, 7:27 pm
రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాకు తీపి కబురందింది. డోపింగ్ కారణంగా తనపై విధించిన నిషేధాన్ని తగ్గిస్తూ ‘కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (సీఏఎస్)’ తీర్పు వెలువరించింది. ఈ మేరకు రష్యా టెన్నిస్ సంఘం అధ్యక్షుడు షమీల్ తర్పిషేవ్ మంగళవారం టాస్ న్యూస్ ఏజెన్సీకి వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 26 నుంచి షరపోవా పోటీల్లో పాల్గొంటుందని వివరించారు.
Samayam Telugu cas cuts doping ban for maria sharapova tass
షరపోవాకు తీపి కబురు

గత జూన్ నెలలో నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో పట్టుబడిన షరపోవా.. రెండేళ్ల నిషేధానికి గురైంది. అయితే ఈ నిషేధాన్ని కోర్టు ఇప్పుడు సుమారు 15 నెలలకు తగ్గించింది. షరపోవా నిషేధాన్ని తగ్గించడం మంచి పరిణామమని తర్పిషేవ్ వ్యాఖ్యానించారు. ఆమె జాతీయ జట్టులో చేరి, తరవాత ఒలిపింక్స్‌లో పతకం సాధించాలని కోరుకుంటున్నామన్నారు. షరపోవా కూడా తన ఆనందాన్ని ఫేస్‌బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.