యాప్నగరం

చైనా ఓపెన్‌లో ఓడిన సింధు.. ముగిసిన భారత్ పోరాటం

చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్లో భారత స్టార్ షట్లర్ సింధు పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో అనామకురాలి చేతిలో ఓటమిపాలైంది.

TNN 17 Nov 2017, 4:36 pm
వరల్డ్ నంబర్ 2 ర్యాంకర్, డిపెండింగ్ ఛాంపియన్ పీవీ సింధు చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనా టీనేజీ ప్లేయర్ గావో ఫంగ్జీ చేతిలో 11-21, 10-21 తేడాతో సింధు వరుస గేముల్లో ఓడింది. అనామకురాలైన ఫంగ్జీతో తలపడిన తొలి మ్యాచ్‌లోనే భారత స్టార్ షట్లర్ ఓటమి పాలైంది. క్వార్టర్స్‌లో సింధు పరాజయంతో చైనా ఓపెన్లో భారత పోరాటం ముగిసింది. అంతకు ముందే సైనా, ప్రణయ్ కూడా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
Samayam Telugu china open defending champion pv sindhu loses to teenager in quarter finals
చైనా ఓపెన్‌లో ఓడిన సింధు.. ముగిసిన భారత్ పోరాటం


ఫంగ్జీ చురుకైన కదలికలు, భారీ షాట్ల ముందు సింధు నిలువలేకపోయింది. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్లో 89వ స్థానంలో ఉన్న ఫంగ్జీ.. వరుస ర్యాలీలతో రెండో ర్యాంకర్ సింధును నిలువరించింది. మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం చెలాయించింది. వరుసగా ఏడు పాయింట్లు సాధించిన చైనీస్ ప్లేయర్ 14-11 ఆధిక్యంలోకి వెళ్లి.. తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. అదే ఊపులో రెండో గేమ్‌లోనూ 7-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ పుంజుకున్న సింధు అంతరాన్ని 6-10కి తగ్గించింది. తిరిగి ఆధిక్యం ప్రదర్శించిన ఫంగ్జీ.. ఆధిక్యాన్ని 16-7కి పెంచింది. తర్వాత సింధుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 21-10 తేడాతో రెండో గేమ్‌ను కూడా సొంతం చేసుకుని విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.