యాప్నగరం

​ చైనా సిరీస్: ఫైనల్‌కి దూసుకెళ్లిన పీవీ సింధు

పీవీ సింధు చైనాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో దూసుకుపోతోంది.

TNN 19 Nov 2016, 8:22 pm
తెలుగమ్మాయి పీవీ సింధు చైనాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో దూసుకుపోతోంది. తన కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ గెలవడానికి కేవలం ఒక మ్యాచ్ దూరంలో ఉంది. శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో దక్షిణ కొరియా క్రీడాకారిణి సుంగ్ జి హ్యూన్ పై విజయం సాధించి ఫైనల్ చేరింది. 1-21, 23-21, 21-19 స్కోరుతో సుంగ్ జి పై సింధు గెలిచింది. తొలి గేమ్‌ను పూర్తిగా కోల్పోయిన సింధు ఆ తరువాత పుంజుకుని బాగా ఆడింది. ఆదివారం జరిగే ఫైనల్స్ లో సున్ యూతో సింధు తలపడనుంది. ఆమెపై కూడా విజయం సాధిస్తే చైనా సూపర్ సిరీస్ టైటిల్ సింధు ఖాతాలో పడుతుంది.
Samayam Telugu china open pv sindhu beats koreas sung ji hyun to enter final
​ చైనా సిరీస్: ఫైనల్‌కి దూసుకెళ్లిన పీవీ సింధు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.