యాప్నగరం

ఫోర్బ్స్ జాబితాలో తొలి ఫుట్‌బాలర్‌గా రొనాల్డో

ఫోర్బ్స్ రూపొందించిన ఓ జాబితా ప్రకారం అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ 10 అథ్లెట్స్‌లో ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్...

MensXP Team 6 Feb 2017, 6:37 pm
ఫోర్బ్స్ రూపొందించిన ఓ జాబితా ప్రకారం అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ 10 అథ్లెట్స్‌లో ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఫుట్‌బాల్ క్రీడలో వున్న ప్రతీ విజయాన్ని, గొప్ప గొప్ప అవార్డుల్ని సొంతంచేసుకున్న ఆటగాడిగా పేరున్న క్రిస్టియానో రొనాల్డో జాబితాలో ఇప్పుడీ రికార్డ్ కూడా చేరిపోయింది. ఎన్నో విజయాలు కైవసం చేసుకున్న ఈ ఆటగాడు 32వ బర్త్ డే సందర్భంగా ఈ మైల్ స్టోన్ అందుకోవడంపై స్పందించిన ది స్పోర్ట్ బైబిల్.. రొనాల్డోకి తనదైన స్టైల్లో అతడికి శుభాకాంక్షలు తెలియజేసింది.
Samayam Telugu cristiano ronaldo first footballer to top forbes list of highest paid athletes
ఫోర్బ్స్ జాబితాలో తొలి ఫుట్‌బాలర్‌గా రొనాల్డో

Happy 32nd birthday to Cristiano Ronaldo. 802 games 568 goals ⚽ 215 assists 🎯 22 trophies 🏆 4 Ballon d'Ors 🏆 3 UEFA best player 🏆 pic.twitter.com/4hdJ7vZomQ — TheSPORTbible (@TSBible) February 5, 2017
జస్ట్ 32 ఏళ్ల ప్రాయంలోనే ఎవ్వరికీ సాధ్యపడనన్ని రికార్డులు సాధించిన రొనాల్డోకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది.
ఫోర్బ్స్ జాబితాలోకి చేరిన టాప్ 10 రిచెస్ట్ అథ్లెట్లు వీళ్లే.

1. క్రిస్టియానో రొనాల్డో (ఫుట్‌బాల్) - $88m

2. లియోనెల్ మెస్సి (ఫుట్‌బాల్) - $81.4m

3. లిబ్రోన్ జేమ్స్ (బాస్కెట్ బాల్) - $77.2m

4. రోజర్ ఫెదరర్ (టెన్నిస్) - $67.8m

5. కెవిన్ డ్యూరంట్ (బాస్కెట్ బాల్) - $56.2m

6. నోవక్ జోకోవిక్ (టెన్నిస్) - $55.8m

7. క్యామ్ న్యూటన్ (అమెరికన్ ఫుట్‌బాల్) - $53.1m

8. ఫిల్ మైఖెల్‌సన్ (గోల్ఫ్) - $52.9m

9. జోర్డన్ స్పీచ్ (గోల్ఫ్) - $52.8m

10. కోబ్ బైరంట్ (బాస్కెట్ బాల్) - $50m

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.