యాప్నగరం

నాకూ ‘బయోపిక్’ కావాలి: సాక్షి మాలిక్

తన జీవితం ఆధారంగా సినిమా రూంపొందించాలని కోరుకుంటోంది రియో ఒలంపిక్స్ కాంస్య పతక విజేత రెజ్లర్ సాక్షి

Samayam Telugu 24 Dec 2016, 12:54 pm
బాలీవుడ్‌లో బయోపిక్‌లు హవా కొనసాగుతోంది. అత్యుత్తమ క్రీడాకారుల జీవితాలు సెల్యూలయిడ్ తెరపైకెక్కుతున్నాయి. కుస్తీపోటీల్లో అత్యుత్తమ క్రీడాకారిణులు గుర్తింపు పొందిన గీతా పోగట్ ఆమె సోదరిమణులు, వాళ్ల తండ్రి మహవీర్ సింగ్ జీవితం ఆధారంగా రూపొందిన ‘దంగల్’ బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలుకొడుతోంది. అంతకుముందు అథ్లెట్ మిల్కాసింగ్ జీవితం ఆధారంగా ‘బాగ్ మిల్కా బాగ్’ కూడా సంచలనం సృష్టించింది. మహిళా బాక్సర్ మేరీ కోమ్ జీవితంపైనా సినిమా వచ్చింది.
Samayam Telugu definitely want a biopic says sakhi malik
నాకూ ‘బయోపిక్’ కావాలి: సాక్షి మాలిక్


ఇప్పుడు అదే తరహాలో తన జీవితం ఆధారంగా సినిమా రూంపొందించాలని కోరుకుంటోంది రియో ఒలంపిక్స్ కాంస్య పతక విజేత రెజ్లర్ సాక్షి మాలిక్ అంటున్నారు.
ప్రొ రెజ్లింగ్ లీగ్ Pro Wrestling League (PWL) ప్రాంచైజీ-ఢిల్లీ సుల్తాన్ లోగో లాంచ్ కోసం శుక్రవారం ఢిల్లీ వచ్చి సాక్షి మీడియాతో మాట్లాడారు.

‘నా జీవితం ఆధారంగా ఎవరైనా సినిమా తీయాలనుకుంటే వారికిదే స్వాగతం. రెజ్లింగ్ ప్రాధాన్యతను చాటిచెప్పేందుకు సినిమా తీస్తామంటే కాదనేది ఎవరు? యువ రెజ్లర్లకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని సాక్షి అభిప్రాయపడ్డారు.

అయితే తన క్యారేక్టర్ ఎవరు పోషించాలనే విషయంపై తాను ఆలోచించలేదని, తన మనసులో ఏ హీరోయిన్ లేరని ఆమో పేర్కొన్నారు.

ఈ యేడాది ఆగస్టులో జరిగిన రియో ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో తొలి క్యాంసం సాధించిన భారతీయ విమెన్ గా సాక్షి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.