యాప్నగరం

డెన్మార్క్‌ ఓపెన్‌ గెలిచిన కిదాంబి శ్రీకాంత్

భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ మరోసారి తన జోరుని బ్యాడ్మింటన్ ప్రపంచానికి గుర్తు చేశాడు. ఆదివారం రాత్రి జరిగిన డెన్మార్క్

TNN 22 Oct 2017, 10:49 pm
భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ మరోసారి తన జోరుని బ్యాడ్మింటన్ ప్రపంచానికి గుర్తు చేశాడు. ఆదివారం రాత్రి జరిగిన డెన్మార్క్ ఓపెన్‌ ఫైనల్లో కొరియాకి చెందిన లీ హ్యూన్‌ని వరుస సెట్లలో మట్టికరిపించి ఏడాదిలోనే మూడో టైటిల్‌ని కైవసం చేసుకున్నాడు. 25 నిమిషాల వ్యవధిలోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం చెలాయించిన శ్రీకాంత్ 21-10, 21-5 తేడాతో లీ హ్యూన్‌ని చిత్తుగా ఓడించాడు.
Samayam Telugu denmark open final highlights kidambi srikanth wins his 3rd superseries premier title
డెన్మార్క్‌ ఓపెన్‌ గెలిచిన కిదాంబి శ్రీకాంత్


25 ఏళ్ల ఈ తెలుగు తేజం ఇటీవల ఇండోనేసియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్ గెలవడంతో పాటు.. సింగపూర్ ఓపెన్ సిరీస్‌లోనూ రన్నరప్‌గా నిలిచి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. తాజా టైటిల్‌తో ఏడాదిలోనే మూడు సూపర్ సిరీస్‌‌లు గెలిచిన షట్లర్‌గా కిదాంబి అరుదైన రికార్డుల్లో నిలిచాడు. శనివారం జరిగిన సెమీ ఫైనల్లోనూ హాంకాంగ్‌కి చెందిన వాంగ్ వింగ్‌కీని 21-18, 21-17తో వరుస సెట్లలో శ్రీకాంత్ ఓడించడం విశేషం.

'శ్రీకాంత్ వరుస సెట్లలో నెగ్గడాన్ని బట్టి గేమ్ చాలా తేలిగ్గా సాగిందని అనుకోవచ్చు. కానీ లీ చాలా కష్టమైన ప్రత్యర్థి. శ్రీకాంత్ అతడి బలహీనతలపై దెబ్బకొట్టాడు. లీ తిరిగి పుంజుకోకుండా శ్రీకాంత్ వరుసగా పాయింట్లు గెలవడం మీదే ధ్యాస పెట్టాడు. టైటిల్ విజయంలో క్రెడిట్ మొత్తం శ్రీకాంత్‌కే దక్కుతుంది. తొలి గేమ్ చివర్లో నేను శ్రీతో మాట్లాడా. లీ తిరిగి పుంజుకునే అవకాశం ఉంది కాబట్టి ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా ఆడమని సూచించా’ అని పుల్లెల గోపీచంద్ ‘సమయం’కు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.