యాప్నగరం

దీపా కర్మాకర్‌కు రాజీవ్ ఖేల్ రత్నా?

దీపా కర్మాకర్... రియో ఒలింపిక్స్‌లో మెడల్ సాధించకపోయినా ప్రజల మనసుల్లో స్థానాన్ని సంపాదించింది.

TNN 17 Aug 2016, 4:03 pm
దీపా కర్మాకర్... రియో ఒలింపిక్స్‌లో మెడల్ సాధించకపోయినా ప్రజల మనసుల్లో స్థానాన్ని సంపాదించింది. కేవలం 0.15 సెకన్లలో పతకం చేజారినా కోట్ల మంది భారతీయుల హృదయాలను గెలచుకుంది. మన దేశం నుంచి ఓ జిమ్నాస్ట్ ఒలింపిక్స్‌కి వెళ్లడమే గొప్పనుకుంటే... దీప ఫైనల్‌కి చేరి భారత దేశ ఖ్యాతిని పెంచింది. ఆమె ప్రదర్శనపై అంతటా సంతృప్తే వ్యక్త మవుతోంది. ఈ నేపథ్యంలో దీపా కర్మాకర్ పేరును రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈమెతో పాటూ షూటర్ జీతూ రాయ్ పేరు కూడా ప్రతిపాదించినట్టు సమాచారం. అలాగే దీపా కోచ్ అయిన బిశ్వేశ్వర్ పేరును ద్రోణాచార్య అవార్డుకు పంపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. మనదేశంలో క్రీడారంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఖేల్ రత్న. ఏడాదికి ఒకరికి మాత్రమే ఇస్తారు. ఈ అవార్డును రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా అందిస్తారు.
Samayam Telugu dipa karmakar recommended for rajiv khel ratna
దీపా కర్మాకర్‌కు రాజీవ్ ఖేల్ రత్నా?


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.