వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో స్విస్ స్టార్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ క్వార్టర్ ఫైనల్ చేరాడు. స్టీవ్ జాన్సన్‌ను 6-2, 6-3, 7-5 తేడాతో ఓడించిన ఫెదరర్ ఎనిమిదోసారి వింబుల్డన్ గెలించేందుకు మరో అడుగు ముందుకేశాడు. జకోవిచ్‌ను ఇంటి ముఖం పట్టించిన జాన్సన్ ఫెదరర్ ముందు మాత్రం తేలిపోయాడు. ఫెదరర్ చివరిసారిగా 2012లో ఇక్కడ గ్రాండ్‌స్లమ్ టైటిల్ నెగ్గాడు. గతేడాది ఫైనల్లో జకోవిచ్ చేతిలో ఓడాడు. 2014 అమెరికన ఓపెన్ నెగ్గిన సిలిక్‌తో క్వార్టర్ ఫైనల్లో రోజర్ తలపడనున్నాడు. ఇప్పటికే జకోవిచ్ వైదొలగడంతో ఈసారి టైటిల్ కోసం బ్రిటన్‌కు చెందిన ఆండీ ముర్రే, ఫెదరర్ తలపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
క్వార్టర్ ఫైనల్లో ఫెదరర్
వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో స్విస్ స్టార్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ క్వార్టర్ ఫైనల్ చేరాడు.
TNN 4 Jul 2016, 8:31 pm