యాప్నగరం

‘ఫిఫా’ హాజరులో భారత్ కొత్త చరిత్ర

భారత్‌లో శనివారంతో ముగిసిన ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ టోర్నీ సరికొత్త మైలురాయిని అందుకుంది.

TNN 29 Oct 2017, 9:52 am
భారత్‌లో శనివారంతో ముగిసిన ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ టోర్నీ సరికొత్త మైలురాయిని అందుకుంది. అండర్-17 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైన టోర్నీగా 17వ ఎడిషన్ రికార్డు సృష్టించింది. ఫైనల్ మ్యాచ్‌తో కలిపి మొత్తం టోర్నీకి 13,47,133 మంది హాజరయ్యారు. ఇప్పటి వరకు జరిగిన 17 టోర్నీల్లో ఇదే అత్యధికం. 1985లో చైనాలో జరిగిన తొలి ఎడిషన్‌కు అత్యధికంగా 12,30,976 మంది హాజరయ్యారు. ఇప్పుడు ఆ రికార్డును భారత ప్రేక్షకులు తిరగరాశారు.
Samayam Telugu fifa u 17 wc in india becomes most attended in events history
‘ఫిఫా’ హాజరులో భారత్ కొత్త చరిత్ర


వాస్తవానికి ఈ రికార్డు ఫైనల్ మ్యాచ్‌కు ముందే చెరిగిపోయింది. మూడో స్థానం కోసం బ్రెజిల్, మాలి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో కలిపి మొత్తం హాజరు సంఖ్య 12,80,459. ఇది చైనాలో జరిగిన తొలి ఎడిషన్ హాజరు కంటే చాలా ఎక్కువే. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు 56,432 మంది హాజరయ్యారు. ఇక ఇంగ్లండ్, స్పెయిన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు 66,674 మంది హాజరయ్యారు. దీంతో ఫిఫా అండ్-17 వరల్డ్ కప్ చరిత్రలో హాజరులో భారత్ కొత్త అధ్యాయం లిఖించింది. అంతేకాకుండా భారత్‌లో ఫుట్‌బాల్‌కు పెరుగుతున్న ఆదరణ స్పష్టంగా కనిపిస్తోంది.
👏🇮🇳 India 2017 sets new #FIFAU17WC records! Total attendance: 1,347,133 Number of goals: 183 pic.twitter.com/j2yRMdoAox — #FIFAU17WC 🇮🇳⚽️🏆 (@FIFAcom) October 28, 2017
గోల్స్‌లోనూ మనదే రికార్డ్..
మొత్తం టోర్నీలో నమోదైన గోల్స్ సంఖ్యలోనూ భారత్‌లో జరిగిన 17వ ఎడిషనే ముందుంది. మొత్తం ఆరు స్టేడియాల్లో జరిగిన 52 మ్యాచుల్లో 183 గోల్స్ నమోదయ్యాయి. 2013లో అమెరికాలో జరిగిన టోర్నీలో నమోదైన 172 గోల్స్ రికార్డును ఈ టోర్నీ అధిగమించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.