యాప్నగరం

ఎట్టకేలకి మూడు నెలల తర్వాత.. భారత్ గడ్డపైకి విశ్వనాథన్‌ ఆనంద్‌

ఐదు సార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్‌ విశ్వనాథన్ ఆనంద్ మూడు నెలల తర్వాత మళ్లీ భారత్‌కి వస్తున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా జర్మనీలోని చిన్న టౌన్‌లో అతను ఉండిపోయాడు.

Samayam Telugu 30 May 2020, 9:14 am
భారత చెస్ దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ ఎట్టకేలకి మళ్లీ స్వదేశంలో అడుగుపెట్టబోతున్నాడు. ఇంటర్నేషనల్ చెస్ టోర్నీలో పాల్గొనేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐరోపా వెళ్లిన ఆనంద్.. కరోనా వైరస్ కారణంగా చాలా దేశాలు లాక్‌డౌన్ విధించడంతో జర్ననీలోని బాడ్‌సోడెన్ అనే చిన్న టౌన్‌లో చిక్కుబడిపోయాడు. అయితే.. తాజాగా లాక్‌డౌన్ నిబంధనల్ని సడలించడంతో భారత్‌కి పయనమైన ఈ చెస్ దిగ్గజం ఈరోజు బెంగళూరు చేరుకోబోతున్నాడు. అయితే.. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజులు క్వారంటైన్ ఉండి ఆ తర్వాత అతను చెన్నై వెళ్లాల్సి ఉంటుంది.
Samayam Telugu Viswanathan Anand


Read More: ధోనీ ఇంకా ఏం సాధించాలి..? రీఎంట్రీ అవసరం లేదు: మాజీ కీపర్

జర్మనీలోనే ఉంటూ విశ్వనాథన్‌ ఆనంద్‌ ఆన్‌లైన్ చెస్ టోర్నీ ద్వారా పీఎం కేర్స్ ఫండ్‌కి విరాళాలు సేకరించాడు. ఈ క్రమంలో ద్రోణవల్లి హారిక, కోనేరు హంపీ, హరికృష్ణ తదితరులతో కలిసి అతను టోర్నీని నిర్వహించడమే కాకుండా.. కామెంట్రీ కూడా ఇచ్చాడు. వాస్తవానికి మార్చి నెలలోనే భారత్‌కి వచ్చే అవకాశం ఆనంద్‌కి వచ్చింది. కానీ.. తన స్వస్థలం చెన్నై‌కి చేరుకునే సూచనలు కనిపించకపోవడంతో అతను అక్కడే ఆగిపోయాడు. దేశంలోనే అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదైన రెండో రాష్ట్రంగా తమిళనాడు 20,246 కేసులతో ప్రస్తుతం కొనసాగుతోంది.

Read More: ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ఆ తత్వంతోనే ఎదిగాడు: వీవీఎస్

జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి న్యూఢిల్లీ, బెంగళూరుకి మాత్రమే ప్లైట్ షెడ్యూల్‌ ఉండగా.. ఆనంద్ Al120 విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఉదయం ఫస్ట్ న్యూఢిల్లీకి వెళ్లనున్న ఆ విమానం.. ఆ తర్వాత మధ్యాహ్నం బెంగళూరుకి చేరుకోనున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.