యాప్నగరం

ఈ బాక్సర్ సంపాదన సెకనుకు రూ.37.7 లక్షలు!

ప్రొఫెషనల్ బాక్సర్‌గా తిరుగులేని విజయాలతో కెరీర్‌కు వీడ్కోలు పలికిన మేవెదర్.. తుది పోరులో సెకనుకు రూ. 37.7 లక్షల చొప్పున సంపాదించాడు.

TNN 27 Aug 2017, 5:32 pm
ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బౌట్‌లో గెలిచిన మేవెదర్.. 50-0 రికార్డుతో కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ‘ఫైట్ ఆఫ్ ద మిలీనియమ్’లో గెలిచిన ఫ్లాయిడ్ మేవెదర్‌కు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ దక్కించుకున్నాడు. ప్రొఫెషనల్ బాక్సర్‌గా ఓటమి ఎరుగని మేవెదర్‌కు ఈ బౌట్ ద్వారా కనీసం 100 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ దక్కనుంది. అరగంట సేపు సాగిన ఈ పోరులో అతడు సెకనుకు రూ. 37.7 లక్షలకు పైగా సంపాదించాడు.
Samayam Telugu floyd mayweather breaks rocky marcianos historic record
ఈ బాక్సర్ సంపాదన సెకనుకు రూ.37.7 లక్షలు!


ఈ పోరులో గెలిచిన మేవెదర్‌కు డైమండ్లు, బంగారంతో పొందుపర్చిన ప్రత్యేక బెల్టును బహుమతిగా అందజేశారు. ఈ బెల్ట్‌లో 3360 వజ్రాలు, 600 నీలాలు, 160 పచ్చలు, కేజిన్నర బరువైన 24 కేరట్ల బంగారాన్ని పొందుపరిచారు.

అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ (యూఎఫ్‌సీ) లైట్ వెయిట్ ఛాంపియన్ అయిన 28 ఏళ్ల మెక్ గ్రెగోర్‌‌పై మేవెదర్ అనూహ్య రీతిలో గెలిచాడు. దీంతో కెరీర్‌లో వరసగా 50వ విజయాన్ని మేవెవదర్ నమోదు చేశాడు. 40 ఏళ్ల వయసులోనూ ప్రత్యర్థిపై అద్భుతంగా విరుచుకుపడ్డాడు. ఈ విజయంతో.. 49-0తో రాకీ మార్సియానో పేరిట ఉన్న అత్యధిక విజయాల రికార్డును బద్దలగొట్టాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.