యాప్నగరం

కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి అంజు రాజీనామా

కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి ప్రముఖ మాజీ భారతీయ అథ్లెట్ అంజు బాబీ జార్జ్ రాజీనామా చేశారు.

Samayam Telugu 23 Jun 2016, 10:24 am
కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి ప్రముఖ మాజీ భారతీయ అథ్లెట్ అంజు బాబీ జార్జ్ రాజీనామా చేశారు. ఏడాది క్రితమే అప్పటి ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ప్రభుత్వ హయాంలో ఆమె కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్‌కి అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అయితే, ఇటీవలి కాలంలో కేరళలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో... కొత్తగా కేరళ క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈపీ జయరాజన్ తనని వేధించారని, కౌన్సిల్‌కి చెందిన ఇతర సభ్యులపట్ల కూడా ఆయన అనుచితంగా ప్రవర్తించారని అంజు ఆరోపించారు. తమని గత ప్రభుత్వం నియమించిందనే కారణంతో ప్రస్తుత కౌన్సిల్ అధ్యక్షులు, సభ్యులంతా కూడా గత ప్రభుత్వానికి చెందిన మనుషులే అని జయరాజన్ వేధించినట్టుగా ఆమె తన ఆరోపణల్లో పేర్కొన్నారు.
Samayam Telugu former indian athlete anju bobby george resigns as president of kerala state sports council
కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి అంజు రాజీనామా


అంజు రాజీనామాకి గల కారణాలని టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌కి చెందిన సమయం మలయాళం స్వయంగా ఆమెనే అడిగి తెలుసుకుంది. "కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని ఫైల్స్‌ని తిరగేసినప్పుడు నేను వాటిని గమనించాను. వాటిని వెలుగులోకి తీసుకువస్తానేమోననే భయంతోనే నాపై వారు కక్షసాధింపు చర్యలకి పాల్పడుతున్నారు. ప్రభుత్వం మారినప్పుడు కొన్ని మార్పులు వుంటాయని ఊహించాం కానీ మరి ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకోలేదు. క్రీడల్లో చోటుచేసుకుంటున్న అవినీతిని అరికట్టేందుకు ప్రజలు, మీడియా సంబంధింత అధికారవర్గాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం వుంది. నాతోపాటే నా సోదరుడు అజిత్ కూడా తన కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నాడు. అజిత్ నియామకంని సైతం ప్రస్తుత మంత్రిత్వ శాఖ తప్పుపట్టింది. కానీ అది అజిత్ 5 మెడల్స్ సాధించడం వల్లే ఆ నియామకం సాధ్యపడిందనే విషయం వారికి తెలియదు. కేవలం నా సోదరుడు అనే కారణంతో అజిత్ నియామకం జరగలేదు" అని అంజు సమయం మలయాళంకి తన రాజీనామాకి దారితీసిన పరిస్థితులని సవివరంగా వెల్లడించారు. ఇదిలావుంటే.. కొత్తగా నియమితులైన క్రీడా మంత్రిపై అంజు ఆరోపణలు చేసిన కొద్దిరోజులకే ఆమె తన అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం ప్రస్తుతం రాజకీయ, క్రీడావర్గాల్లో చర్చకి దారితీసింది.

SOURCE :-
http://malayalam.samayam.com/sports/others-sports/anju-requests-for-vigilence-enquiry/articleshow/52868610.cms

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.