యాప్నగరం

హాకీ: ఆస్ట్రేలియాతో భారత్ ఢీ

ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్ నేడు మెల్‌బోర్న్‌లో ప్రారంభం కానుంది.

TNN 23 Nov 2016, 2:09 pm
ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్ నేడు మెల్‌బోర్న్‌లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భారత జట్టు ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. గత నెల ఆసియా చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుని ఊపుమీదున్న టీం ఇండియా కంగారూలను ఢీకొట్టనుంది. ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియాతో పాటు మలేసియా, న్యూజిలాండ్ జట్లు పాల్గొంటున్నాయి.
Samayam Telugu four nations tournament asian hockey champions india face australia
హాకీ: ఆస్ట్రేలియాతో భారత్ ఢీ


భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ఆరంభం అవుతుంది. ప్రస్తుతం భారత హాకీ జట్టుకు వీఆర్ రఘునాథ్ సారథ్యం వహిస్తున్నారు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు నాయకత్వం వహించిన గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ గాయం కారణంగా ప్రస్తుత నాలుగు దేశాల టోర్నమెంట్‌లో ఆడటం లేదు. దీంతో శ్రీజేష్ స్థానాన్ని రఘునాథ్ భర్తీ చేశాడు.

కాగా, బుధవారం ఆస్ట్రేలియాను ఢీకొంటున్న భారత్.. నవంబర్ 24న మలేసియాతో, నవంబర్ 26న న్యూజిలాండ్‌తో తలపడుతుంది. నవంబర్ 27న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.