యాప్నగరం

ఫ్రెంచ్ ఓపెన్లో ఓడిన సింధు.. ముగిసిన భారత్ పోరాటం

ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ రెండో రౌండ్లో భారత షట్లర్ పీవీ సింధు ఓటమిపాలైంది. దీంతో పారిస్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది.

TNN 28 Oct 2016, 11:45 am
రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించింది కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. రెండో రౌండ్‌లో ఆమె చైనాకు చెందిన పదకొండో సీడ్ హి బింగ్‌జియావో చేతిలో 20-22, 17-21 తేడాతో ఓటమిపాలైంది. ఇటీవల జరిగిన డెన్మార్క్ ఓపెన్లో జియావోను ఓడించిన సింధు ఈ మ్యాచ్‌లో మాత్రం విజయం సాధించలేకపోయింది. భారత్‌కు చెందిన మరో షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా రెండో రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన ఐదో సీడ్ ఆటగాడు చెన్ చౌ చేతిలో 19-21 16-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. స్విస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన ప్రణయ్ ఫ్రెంచ్ ఓపెన్లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.
Samayam Telugu french open sindhu prannoy lose in second round
ఫ్రెంచ్ ఓపెన్లో ఓడిన సింధు.. ముగిసిన భారత్ పోరాటం


ఇటీవల ముగిసిన డచ్ ఓపెన్లోనూ సింధు అంచనాల మేరకు రాణించలేకపోయింది. ఆ ఓపెన్‌లో ఫైనల్ చేరిన అజయ్ జయరాం ఫ్రెంచ్ ఓపెన్లో తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టి నిరాశ పర్చాడు. దీంతో పారిస్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.