యాప్నగరం

సాక్షికిచ్చారు.. మరి కోచ్ సంగతేంటీ?

సాక్షి మాలిక్ కోచ్ కుల్ దీప్ సింగ్ గురించి మనలో ఎంతమందికి తెలుసు?

TNN 27 Sep 2016, 9:42 pm
ప్రతిష్టాత్మకమైన రియో ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించి దేశం పరువు నిలిపిన మహిళామణులు సాక్షిమాలిక్, సింథూ గురించి ఇప్పుడు దేశంలో ఎవరికి ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. సింథూకు కోచ్ గా తర్ఫీదునిచ్చి పతకాన్ని సాధించేందుకు అడుగడుగునా స్ఫూర్తినిచ్చిన గోపీచంద్ గురించీ మనకు ఎవరూ వివరించాల్సినవసరంలేదు. కోచ్ గా మారడానికి ముందు అద్బుతమైన బ్యాడ్మింటన్ ఆటగాడిగా అంతర్జాతీయంగా దేశ ఖ్యాతిని ఎప్పుడో చాటాడు మన గోపీచంద్. మరి, సాక్షి మాలిక్ కోచ్ కుల్ దీప్ సింగ్ గురించి మనలో ఎంతమందికి తెలుసు? కనీసం ప్రభుత్వాలైనా ఆయనను గుర్తించాయా? అతని పేరు గురించి మనలో ఎంతమందికి తెలుసు? పీవీ సింధూ రజతం సాధించిన తరువాత ఆమెతో సమానంగా గోపీచంద్ కు దేశం బ్రహ్మరథం పట్టింది. హర్యానా ప్రభుత్వం కూడా సాక్షిమాలిక్ తో పాటు ఆమె కోచ్ కుల్ దీప్ సింగ్ కు కూడా నగదు బహుమతిని ప్రకటించింది. కానీ, ఇంతవరకు తనకు ప్రభుత్వం నుండి చిల్లుగవ్వ కూడా రాలేదని కుల్ దీప్ వాపోతున్నారు. ఇప్పటికి లెక్కలేనన్ని సార్లు అధికారుల చుట్టూ తిరిగినా వారు కనీసం కనికరించను కూడా కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రకటించిన క్యాష్ అవార్డును ఇచ్చి మాటనిలుపుకుంటే, రానున్న రోజుల్లో మరిందరు సాక్షి మాలిక్ లను తయారుచేయగల స్ఫూర్తినని తనలో నింపినవారు అవుతారని ఆయన అంటున్నారు.
Samayam Telugu havent received any recognition cash awards yet sakshi maliks coach
సాక్షికిచ్చారు.. మరి కోచ్ సంగతేంటీ?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.