యాప్నగరం

భారత హాకీ జట్టుకి కోచ్ కావలెను..!

భారత హాకీ జట్టు కోచ్ కోసం హాకీ ఇండియా (హెచ్‌ఐ) అన్వేషణ ప్రారంభించింది. అర్హత కలిగిన అభ్యర్థులు

TNN 5 Sep 2017, 5:51 pm
భారత హాకీ జట్టు కోచ్ కోసం హాకీ ఇండియా (హెచ్‌ఐ) అన్వేషణ ప్రారంభించింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తొలిసారి అధికారిక వెబ్‌సైట్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. గత వారం చీఫ్ కోచ్ ఓల్ట్‌మాన్స్‌ని బాధ్యతల నుంచి అనూహ్యంగా హాకీ ఇండియా తప్పించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు డైరెక్ట్‌గానే కోచ్‌ని ఎంపిక చేస్తున్న హెచ్‌ఐ తొలిసారి బీసీసీఐ తరహాలో కోచ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం విశేషం.
Samayam Telugu hockey india invites applications for roelant oltmans replacement
భారత హాకీ జట్టుకి కోచ్ కావలెను..!


2020 టోక్యో ఒలింపిక్స్‌ని దృష్టిలో పెట్టుకుని కోచ్‌ ఒప్పందం మూడేళ్లుగా నిర్ణయించారు. అంటే.. సుమారు 2020, డిసెంబరు 31 వరకు పదవిలో కొనసాగనున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న ఒలింపిక్స్ క్వాలిఫికేషన్‌కి భారత పురుషుల జట్టుని సిద్ధం చేయాలని.. దాంతో పాటు ఒలిపింక్స్‌లో జట్టు సత్తాచాటేలా మెరుగైన శిక్షణ ఇవ్వాలని నోటిఫికేషన్‌లో హాకీ ఇండియా పేర్కొంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు తమ వివరాలను సెప్టెంబరు 15లోపు హాకీ ఇండియా సీఈవోకి పంపాలని సూచించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.