యాప్నగరం

పీవీ సింధు, సైనా నెహ్వాల్ దూకుడు

భారత షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ దూకుడు ప్రదర్శిస్తున్నారు.

TNN 29 Mar 2017, 7:53 pm
భారత షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ 2017’ టోర్నమెంట్‌‌లో సింధు, సైనా రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో తైవాన్ క్రీడాకారిణి లీ చియా-సిన్‌పై సైనా నెహ్వాల్ 21-10, 21-17 తేడాతో గెలుపొందింది. అలాగే సింధు భారత్‌కే చెందిన అరుంధతి పన్టావానేను 21-17, 21-6 తేడాతో ఓడించింది.
Samayam Telugu india open super series 2017 pv sindhu saina nehwal breeze into second round
పీవీ సింధు, సైనా నెహ్వాల్ దూకుడు


ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన సైనా రెండో రౌండ్‌లో థాయిలాండ్‌కు చెందిన పోర్న్‌పవీ చోంచువాంగ్‌తో తలపడుతుంది. ఇక సింధు జపాన్ క్రీడాకారిణి సీనా కవాకమితో పోరాడుతుంది. ఈ రెండు మ్యాచ్‌లు గురువారం జరగనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.