యాప్నగరం

​భారత ఫుట్‌బాల్ చరిత్రలో ‘తొలి గోల్’

ఫిఫా అండర్-17 ప్రపంచకప్ లో భాగంగా కొలంబియాతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్ ను భారత జట్టు మరపురానిదిగా మార్చుకుంది.

TNN 10 Oct 2017, 8:14 am
ఫిఫా అండర్-17 ప్రపంచకప్ లో భాగంగా కొలంబియాతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్ ను భారత జట్టు మరపురానిదిగా మార్చుకుంది. మ్యాచ్ లో విజయం సాధించకపోయినా.. మన జట్టు ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో తొలి గోల్ ను నమోదు చేసుకుంది. ఒక దశలో మ్యాచ్ ను డ్రాగా ముగిస్తుందనేంత వరకూ వచ్చి భారత అండర్-17 జట్టు ఆసక్తిని రేకెత్తించింది. అయితే పటిష్టమైన కొలంబియా జట్టు రెండో గోల్ ను కూడా కొట్టేసి.. మ్యాచ్ ను తమవైపు తిప్పకుంది 2-1తో విజయం సాధించింది.
Samayam Telugu india vs colombia first history then heartbreak for india
​భారత ఫుట్‌బాల్ చరిత్రలో ‘తొలి గోల్’


తొలి మ్యాచ్ లో భారత కుర్రాళ్లు అమెరికా జట్టు చేతిలో 3-0తో ఓటమి పాలయ్యారు. అయితే రెండో మ్యాచ్ లో మాత్రం కొలంబియాకు ముచ్చెమటలు పట్టించారు. భారత్ కంటే పటిష్టమైన, మెరుగైన స్థితిలో ఉన్న జట్టు కొలంబియా. అంతర్జాతీయ స్థాయి సాకర్ స్టార్లకు పుట్టినిల్లు కొలంబియా. అలాంటి దేశపు కుర్రాళ్లతో సాకర్ లో పసికూన అయిన భారత్ తలపడింది. మ్యాచ్ ఫలితం ముందుగా ఊహించదగినదే అయినా.. టీమిండియా ఈ మ్యాచ్ లో మంచి ప్రదర్శన ఇచ్చింది. తొలి గోల్ కొలంబియానే చేసింది. 1-0తో లీడ్ లో ఉండగా 82వ నిమిషయంలో భారత్ తరఫున మిడ్ ఫీల్డర్ జీక్సన్ సింగ్ తొలి గోల్ నమోదు చేసి.. చరిత్రకు ఎక్కాడు.

స్కోర్ 1-1 గా సమం అయిన సమయంలో.. 83 వ నిమిషంలో కొలంబియా ఆటగాడు జువాన్ పెనలోజా రెండో గోల్ కొట్టాడు. దీంతో మ్యాచ్ లో వారి విజయం ఖాయమైంది.



ఓటమిపాలైనప్పటికి ఒక ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో తొలి గోల్ ను నమోదు చేసుకోవడంతో పాటు.. కొలంబియా జట్టుకు ఫుల్‌ఫైట్ ను ఇవ్వడంలో భారత జట్టు విజయవంతం అయ్యింది. వన్ సైడ్ అవుతుంది అనుకున్న మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. క్రితం మ్యాచ్ తో పోలిస్తే.. మన జట్టు మరింత మెరుగైన ఆటతీరును కనబరిచింది.

ఇక ప్రపంచకప్ లోని ఇతర మ్యాచ్ ల ఫలితాలను పరిశీలిస్తే... గ్రూప్ ఏ లో అమెరికా 1-0తో ఘనాను ఓడించింది. గ్రూప్ బి లో మాలి జట్టు 3-0తో టర్కీని ఓడించింది. పరాగ్వే 4-2తో న్యూజిలాండ్ పై విజయం సాధించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.