యాప్నగరం

India vs South Africa: దక్షిణాఫ్రికాతో హాకీలో ఈరోజు భారత్ ఢీ..!​

2010లో ఇలానే భారత్‌లో జరిగిన హాకీ ప్రపంచకప్‌లో వరుస ఓటములతో ఆఖరికి 8వ స్థానంతో భారత్ సరిపెట్టుకుంది.

Samayam Telugu 28 Nov 2018, 6:22 pm
భువనేశ్వర్ వేదికగా ఆరంభమైన హాకీ ప్రపంచకప్‌లో ఈరోజు నుంచి మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. భారీ అంచనాల మధ్య టోర్నీలోకి అడుగుపెట్టిన భారత్ జట్టు తొలి మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికాతో ఈరోజు ఢీకొననుంది. కొత్త కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలో ఇటీవల ఘన విజయాల్ని అందుకున్న భారత్ జట్టు సొంత అభిమానుల మధ్య అదే జోరుని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.
Samayam Telugu DtFDOy1VsAEV1C1


సీనియర్ల, జూనియర్ల కలయికతో ఈసారి జట్టు మంచి సమతూకంతో కనిపిస్తుండగా.. జూనియర్ ప్రపంచకప్‌ గెలిచిన జట్టులోని దాదాపు 7 మంది ఆటగాళ్లని ఈ టోర్నీలో భారత్ ఆడిస్తోంది. గోల్‌కీపర్ శ్రీజేశ్ సూపర్ ఫామ్‌తో భారత్‌ జట్టులో ఉత్సాహం నింపుతుండగా.. బీరేంద్ర, హర్మన్‌ప్రీత్ సింగ్; లలిత్ ఉపాధ్యాయ్ ఆట కీలకం కానుంది.

అయితే.. సొంతగడ్డపై 2010లోలా భారత్ నిరాశపరచకూడదని అభిమానులు ఆశిస్తున్నారు. 2010లో ఇలానే భారత్‌లో జరిగిన హాకీ ప్రపంచకప్‌లో వరుస ఓటములతో ఆఖరికి 8వ స్థానంతో భారత్ సరిపెట్టుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.