యాప్నగరం

హాకీకే స్ఫూర్తి.. బల్బీర్ సింగ్ సీనియర్

హాకీలో వరసగా మూడు ఒలింపిక్ స్వర్ణ పతకాలు, స్వతంత్ర భారతదేశం తరఫున ఒలింపిక్స్‌లో తొలి పతాకధారి, దేశంలో జీవించి ఉన్న అత్యంత వృద్ధ ఒలింపియన్, ఆయనెవరో కాదు.. భారత దిగ్గజ హాకీ ఆటగాడు బల్బీర్ సింగ్ దోసాంఝ్.

TNN 17 Oct 2016, 6:09 pm
హాకీలో వరసగా మూడు ఒలింపిక్ స్వర్ణ పతకాలు, స్వతంత్ర భారతదేశం తరఫున ఒలింపిక్స్‌లో తొలి పతాకధారి, దేశంలో జీవించి ఉన్న అత్యంత వృద్ధ ఒలింపియన్, ఆయనెవరో కాదు.. భారత దిగ్గజ హాకీ ఆటగాడు బల్బీర్ సింగ్ దోసాంఝ్. అందరికీ తెలిసిన పేరు బల్బీర్ సింగ్ సీనియర్. 1948, 1952, 1956 ఇలా వరసగా మూడు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత హాకీ జట్టులో బల్బీర్ కీలక ఆటగాడు. ప్రస్తుతం ఈయన వయసు 93 ఏళ్లు. దిగ్గజ ఆటగాడు ధ్యాన్‌చంద్‌తో కలిసి ఆడినప్పటికీ ఆయనకొచ్చినంత గుర్తింపు బల్బీర్‌కి రాకపోవడం బాధాకరం.
Samayam Telugu indian hockey legend balbir singh srs inspiring outlook
హాకీకే స్ఫూర్తి.. బల్బీర్ సింగ్ సీనియర్

అయితే అప్పటి భారత హాకీ జట్టుకు నివాళులర్పిస్తూ బల్బీర్ చెప్పిన కొన్ని మనసుకు హత్తుకునే విషయాలను ఒలింపిక్ ఛానల్.. వీడియో రూపంలో తన వెబ్‌సైట్‌లో ఉంచింది. భారత హాకీ అభిమానులందరూ తప్ప చూడాల్సిన వీడియో అది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.