యాప్నగరం

టైటిల్‌కు అడుగు దూరంలో సానియా మీర్జా

అంతర్జాతీయ టెన్నిస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన భారత ప్లేయర్ సానియా మీర్జా సత్తాచాటుతోంది. హోబర్ట్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుని టైటిల్‌కు ఒక్క అడుగుదూరంలో నిలిచింది.

Samayam Telugu 17 Jan 2020, 2:31 pm
రెండేళ్ల విరామం తర్వాత టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టిన భారత ఏస్ ప్లేయర్ సానియా మీర్జా టైటిల్ సాధించేందుకు ఒక్క అడుగుదూరంలో నిలిచింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీలో తన పార్ట్‌నర్ నాదియా కిచెనోక్ (ఉక్రెయిన్)తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగే ఫైనల్లో గెలిస్తే టోర్నీని సొంతం చేసుకుంటుంది.
Samayam Telugu sania mirza


Read Also : IND vs AUS 2nd ODI: భారత్ ఫస్ట్ బ్యాటింగ్.. తుది జట్టులో రెండు మార్పులు
శుక్రవారం ఉదయం జరిగిన మహిళల డబుల్స్ సెమీస్‌లో అన్‌సీడెడ్ సానియా జంట 7-6 (7/3), 6-2తో బౌజుకోవా-జిదాన్సెక్‌పై సునాయాస విజయం సాధించింది. గంటా 25 నిమిషాలపాటు ఈ మ్యాచ్‌ జరిగింది. తొలిసెట్‌లో ఇరువురు చెరోసారి సర్వీస్ కోల్పోవడంతో టైబ్రేకర్‌కు దారి తీసింది. ఓ దశలో 1-3తో ఓటమి వైపు వెళ్తుతున్నట్లు కన్పించిన సానియా జంట.. తర్వాత పుంజుకుని వరుసగా ఆరు పాయింట్లు సాధించి సెట్‌ను కైవసం చేసుకుంది. ఇక రెండోసె‌ట్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

Read Also : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జైత్రయాత్ర
శనివారం జరిగే ఫైనల్లో రెండోసీడ్ షువాయ్ పెంగ్-షువాయ్ జాంగ్‌తో సానియా జంట తలపడనుంది. మరోవైపు 2017 అక్టోబర్‌లో చైనా ఓపెన్‌లో ఆడిన అనంతరం సానియా విరామం తీసుకుంది. ఈక్రమంలో తన కొడుకు ఇజాన్ మీర్జా మాలిక్‌కు జన్మనిచ్చింది. హోబర్ట్‌ టోర్నీతోనే అంతర్జాతీయ టెన్నిస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన సానియా.. ఏకంగా ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. డబుల్స్‌లో సానియాకు మంచి రికార్డు ఉంది. మహిళల, మిక్స్‌డ్ విభాగాల్లో కలిపి ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలవడంతోపాటు, ఒకనొకదశలో వరల్డ్ నం.1 ప్లేయర్‌గా నిలిచింది.

undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.