యాప్నగరం

మరోసారి ఐపీటీఎల్ విజేతగా సింగపూర్ స్లామర్స్

ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ టైటిల్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ సింగపూర్ స్లామర్స్ మరోసారి తన ఖాతాలో వేసుకుంది

TNN 12 Dec 2016, 11:02 am
ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ టైటిల్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ సింగపూర్ స్లామర్స్ మరోసారి తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 30-14 తేడాతో ఇండియన్ ఏసెస్‌ను ఓడించింది. లీగ్ దశలో అద్భుతంగా ఆడిన ఇండియన్ ఏసెస్ కీలక పోరులో మాత్రం నిరాశపరిచింది. గత ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పురుషుల లెజెండ్స్ సింగిల్స్ మ్యాచ్‌లో కార్లోస్ మోయా 6-4తో ఫిలిప్పోసిస్‌ను ఓడించాడు. దీంతో స్లామర్స్‌కు శుభారంభం దక్కింది
Samayam Telugu iptl 2016 singapore slammers defend title by winning indian aces
మరోసారి ఐపీటీఎల్ విజేతగా సింగపూర్ స్లామర్స్


మహిళల సింగిల్స్‌లో హైదరాబాదీ స్టార్ ప్లేయర్ సానియా మీర్జాను కికి బెర్‌టెన్స్ 6-3తో ఓడించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జా- రోహన్ బోపన్న ద్వయం కూడా 1-6తో బెర్‌టెన్స్-మార్సెలో మెలో జోడి చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది. పురుషుల డబుల్స్‌లోనూ స్లామర్స్ సత్తా చాటింది. ఆ జట్టుకు చెందిన కిర్గియోస్-మెలో జోడి 6-2తో డోడిగ్-లోపెజ్ జంటపై విజయం సాధించారు. పురుషుల సింగిల్స్‌లో స్లామర్స్‌కు చెందిన బగ్దాటిస్ 6-4 తేడాతో ఫెలిసియానో లోపెజ్‌ను ఓడించాడు. దీంతో ఏసెస్ జట్టు ఆశలు ఆవిరయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.