యాప్నగరం

9.55Sec.. భారత్‌లో ఉసేన్ బోల్ట్ వెలుగులోకి

100మీ పరుగులో దశాబ్దకాలం పాటు ఉసేన్ బోల్ట్ తిరుగులేని రికార్డ్‌లు నెలకొల్పాడు. భూమ్మీద అతని కంటే వేగంగా పరుగెత్తేవాళ్లు ఎవరూ లేరని నానుడి. కానీ.. తాజాగా శ్రీనివాస్ గౌడ అతని కంటే వేగంగా పరుగెత్తినట్లు వార్తలు వస్తున్నాయి.

Samayam Telugu 15 Feb 2020, 3:37 pm
జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ గురించి అందరూ వినే ఉంటారు. 100మీటర్ల పరుగుని కేవలం 9.58 సెకన్లలో పూర్తి చేసిన బోల్ట్.. ట్రాక్‌పై సరికొత్త వరల్డ్‌ రికార్డ్‌లు నెలకొల్పాడు. కానీ.. అతని కంటే వేగంగా కర్ణాటకకి చెందిన శ్రీనివాస్ గౌడ పరుగెత్తి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఎంతలా అంటే..? 100మీ పరుగుని 9.55 సెకన్లలో అదీ బురద నీళ్లలో పూర్తి చేసి ఔరా అనిపించాడు. దీంతో.. ఇప్పుడు శ్రీనివాస్‌‌ని అందరూ భారత్ ఉసేన్ బోల్ట్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Samayam Telugu Kambala,Kambala jockey Srinivasa Gowda



కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల శ్రీనివాస్ గౌడ.. ఇటీవల అక్కడ జరిగిన సంప్రదాయ కంబాలా (బఫెలో రేస్) పోటీల్లో తన వేగంతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రేసులో భాగంగా 142.5మీ పరుగుని శ్రీనివాస్ కేవలం 13.62 సెకన్లలోనే పూర్తిచేశాడు. ఈ లెక్కన 100మీ పరుగుని అతను 9.55 సెకన్లలోనే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీంతో.. ఉసేన్ బోల్ట్‌ రికార్డ్‌ని అతను బ్రేక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


శ్రీనివాస్ గౌడ వేగంపై ఆశ్చర్యపోయిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్.. అతనికి శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్‌కి పంపించాలని భారత్ అథ్లెటిక్ అసోషియేషన్‌ని కోరాడు. ఆనంద్ మహీంద్ర కూడా శ్రీనివాస్ గౌడని ప్రశంసిస్తూ కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజికి ట్యాగ్‌ చేశారు. దీంతో.. మంత్రి కూడా పాజిటివ్‌గా స్పందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.