యాప్నగరం

మలేషియా ఓపెన్‌ సెమీస్ చేరిన శ్రీకాంత్

కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మలేషియా ఓపెన్‌లో కిదాంబి శ్రీకాంత్ జోరు కొనసాగిస్తున్నాడు. టోర్నీలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఫ్రాన్స్‌కి

Samayam Telugu 29 Jun 2018, 6:28 pm
కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మలేషియా ఓపెన్‌లో కిదాంబి శ్రీకాంత్ జోరు కొనసాగిస్తున్నాడు. టోర్నీలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఫ్రాన్స్‌కి చెందిన బ్రైస్‌ లెవెర్డెజ్‌తో జరిగిన మ్యాచ్‌లో అలవోక విజయం అందుకున్న శ్రీకాంత్ సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన శ్రీకాంత్.. 21-18, 21-14తో వరుస సెట్లలో విజయం సాధించాడు. భారత షట్లర్ దూకుడుతో కేవలం 39 నిమిషాల్లోనే మ్యాచ్‌ ముగిసిపోయింది.
Samayam Telugu kidambi srikanth enters semifinals of malaysia open
మలేషియా ఓపెన్‌ సెమీస్ చేరిన శ్రీకాంత్


తొలి సెట్ ఆరంభంలోనే 5-8తో వెనకబడిన శ్రీకాంత్.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని 12-12తో బ్రైస్‌ని సమం చేశాడు. ఈ దశలో ఫ్రాన్స్ షట్లర్ వరుస తప్పిదాలు చేయడంతో.. ఒక్కసారిగా 17-14తో ఆధిక్యం సాధించిన శ్రీకాంత్.. అలవోకగా సెట్‌ని ముగించాడు. ఆ తర్వాత.. రెండో సెట్‌లో ఇద్దరూ నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డారు. దీంతో.. 5-5తో ఇద్దరూ సమంగా నిలిచిన దశలో బ్రైస్‌ మళ్లీ తడబడ్డాడు. దీంతో దూకుడు పెంచిన శ్రీకాంత్ 11-5తో ఆధిక్యాన్ని అందుకుని ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమివ్వకుండా మ్యాచ్‌ని గెలుపుగా ముగించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.