యాప్నగరం

సెయిలింగ్‌లో మెరిసిన తెలంగాణ కుర్రాళ్లు

తెలంగాణ రాష్ట్ర ఓపెన్‌ సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్థానిక కుర్రాళ్లు మెరిసారు. తెలంగాణ ఆటగాళ్లు కోటేశ్వరరావు, సాయిబాబా, గౌతమ్‌ సత్తాచాటారు.

TNN 13 Jul 2017, 1:02 pm
తెలంగాణ రాష్ట్ర ఓపెన్‌ సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్థానిక కుర్రాళ్లు మెరిసారు. తెలంగాణ ఆటగాళ్లు కోటేశ్వరరావు, సాయిబాబా, గౌతమ్‌ సత్తాచాటారు. రాష్ట్రస్థాయి జూనియర్‌ లేజర్‌ 4.7 క్లాస్‌లో కోటేశ్వరరావు స్వర్ణం, సాయిబాబా రజతం, గౌతమ్‌ కాంస్యం గెల్చుకున్నారు. ఓపెన్‌ విభాగంలో కోటేశ్వరరావు మూడోస్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు. మొత్తం నాలుగు రోజులపాటు హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఓపెన్ ఛాంపియన్‌షిప్స్ బుధవారం ముగిశాయి.
Samayam Telugu local lads masti saibaba gautham kankatla and koteshwar rao emerge champions from telangana state
సెయిలింగ్‌లో మెరిసిన తెలంగాణ కుర్రాళ్లు


గోవా, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి మొత్తం 45 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హెచ్ఎండీఏ కమిషనర్ డాక్టర్ చిరంజీవులు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లెఫ్ట్‌నెంట్ జనరల్ కె.ఎస్.రావు మాట్లాడుతూ.. వరసగా రెండు రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్‌లు నిర్వహించామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాని అన్నారు. ఈ ఏడాది పోటీదారుల సంఖ్య కూడా మూడింతలు పెరిగిందని చెప్పారు. విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

డాక్టర్ చిరంజీవిలు మాట్లాడుతూ.. 400 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ ప్రధాన ఆకర్షణ అని అన్నారు. హైదరాబాద్‌లో ఉన్నట్లు ఏ ఇతర నగర నడిబొడ్డులో ఇంత పెద్ద సరస్సు లేదని చెప్పారు. 5.7 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న ఇంతపెద్ద సరస్సు నిర్వహణ సవాళ్లతో కూడుకున్నదన్నారు. ‘సెయిలింగ్ కూడా చాలా కష్టమైన క్రీడ. చాలా మందికి నీళ్లంటే భయముంటుంది. సెయిలర్ కావాలంటే చాలా ధైర్య సాహసాలుండాలి. ఈ ఛాంపియన్‌షిప్స్ భవిష్యత్తులో ప్రపంచ స్థాయి సెయిలర్లను తయారుచేస్తాయని భావిస్తు్న్నాను’ అని వెల్లడించారు.

విజేతలు వీరే..
జూనియర్ ఓపెన్ లేజర్ 4.7

1. రామ్ మిలాన్ యాద్ (మధ్యప్రదేశ్)
2. చిత్రేష్ తాట (తమిళనాడు)
3. కోటేశ్వరరావు (తెలంగాణ)

జూనియర్స్ స్టేట్ లేజర్ 4.7
1. కోటేశ్వరరావు
2. మస్తీ సాయిబాబా
3. గౌతమ్ కంకట్ల

సీనియర్ లేజర్ స్టాండర్డ్
1. అజయ్ సింగ్ రాజ్‌పుత్ (మహారాష్ట్ర)
2. అవినాష్ యాదవ్ (మహారాష్ట్ర)
3. లిమ్ జాన్ (కర్ణాటక)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.