యాప్నగరం

పతకాలు గెలిచిన రెజ్లర్ల దుస్థితి.. రైలులో టాయిలెట్ల వద్ద కూర్చొని ప్రయాణం

ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో ఉన్న నందిని నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 63వ రెజ్లింగ్ నేషనల్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మహారాష్ట్రకు చెందిన రెజ్లర్లు పాల్గొన్నారు.

Samayam Telugu 4 Dec 2018, 1:49 pm
రైళ్లలో టాయిలెట్లకు దగ్గరగా ఉన్న బెర్తులు వస్తేనే మనం ‘అబ్బా కంపు’ అంటూ చిరాకు పడతాం. జనరల్ టిక్కెట్ తీసుకొని రిజర్వేషన్ బోగీలోకి ఎక్కిన కొందరు టాయిలెట్ల వద్ద కూర్చొనో, నిలబడో ఉంటే.. వీళ్లు కంపు ఎలా బరిస్తున్నారు అనుకుంటాం. మరి అలాంటిది, జాతీయ స్థాయి క్రీడాకారులకు ఇలాంటి దుస్థితి వస్తే ఎలా ఉంటుంది. సుమారు రెండు రోజుల పాటు టాయిలెట్ల వద్దే కూర్చొని, నిలబడి ప్రయాణం చేసిన వారికి ఇంకెంత చిరాకుగా, అసహనంగా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితినే మహారాష్ట్రకు చెందిన రెజ్లర్లు ఎదుర్కొన్నారు.
Samayam Telugu Wrestlers1

ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో ఉన్న నందిని నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 63వ రెజ్లింగ్ నేషనల్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మహారాష్ట్రకు చెందిన రెజ్లర్లు పాల్గొన్నారు. ఐదు పతకాలు కూడా గెలిచారు. వీటిలో ఒక బంగారు పతకం కూడా ఉంది. పోటీలు ముగిసిన తరవాత తిరిగి పుణేకు రావడానికి సంబంధిత అధికారులు టిక్కెట్లు బుక్ చేయలేదు. దీంతో రెజ్లర్లంతా సాకేత్ ఎక్స్‌ప్రెస్‌లోని రిజర్వ్‌డ్ బోగీల టాయిలెట్ల వద్ద కూర్చొని ప్రయాణం చేశారు. గోండా నుంచి పుణేకు 35 గంటల ప్రయాణం. ఈ 35 గంటలు వారికి నరకంలా సాగింది. అధికారుల నిర్లక్ష్యంపై రెజ్లర్లు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.