యాప్నగరం

మరియా షరపోవాపై నిషేధం ఎత్తేస్తారా?

ఐదు గ్రాండ్ స్లామ్ టైటిళ్ల విజేత మరియా షరపోవా టెన్నిస్ భవితవ్యం అతి త్వరలో తేలనుంది

TNN 13 Sep 2016, 10:06 pm
ఐదు గ్రాండ్ స్లామ్ టైటిళ్ల విజేత మరియా షరపోవా టెన్నిస్ భవితవ్యం అతి త్వరలో తేలనుంది. మెల్డోనియం అనే నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు రుజువు కావడంతో ఈ రష్యన్ టెన్నిస్ క్రీడాకారిణిపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) రెండేళ్ల నిషేధం విధించిన సంగతి విదితమే. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీకి ముందు జరిపిన పరీక్షల్లో షరపోవా పాజిటివ్ అని తేలడంతో ఆమెపై నిషేధం పడింది. మెల్డోనియంను అంతర్జాతీయ డోపింగ్ వ్యతిరేక సంఘం (వాడా) ఈ ఏడాది మొదట్లో నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలో చేర్చింది. అంతే కాకుండా, మార్చి నెల ముందు వరకు మెల్డోనియంను తీసుకున్నప్పటికీ అథ్లెట్లపై నిషేధం విధించరాదని, ఏప్రిల్ నుండి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని వాడా చెప్పింది. కానీ ఐటీఎఫ్ దాన్ని పట్టించుకోకుండా షరపోవాపై నిషేధం విధించింది. దీన్ని ఆమె సవాలు చేస్తూ ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించింది. పదేళ్లుగా మెల్డోనియం డ్రగ్ ను కుటుంబ వైద్యుని సలహా మేరకు తాను తీసుకుంటున్నట్లు ఆమె కోర్టుకు తెలిపింది. కానీ, ఇటీవలి వరకు దాని పేరు మెల్డోనియం అని తెలియనే తెలియదని స్పష్టం చేసింది. ప్రస్తుతం మరియా కేసును కోర్టు విచారిస్తోంది. వచ్చే నెల మొదట్లో తీర్పు వచ్చే అవకాశం ఉంది. కోర్టు తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని మరియా కోటి ఆశలతో ఉంది.
Samayam Telugu maria sharapova appeals court for the verdict to be given in first week of october
మరియా షరపోవాపై నిషేధం ఎత్తేస్తారా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.