యాప్నగరం

ఉసేన్ బోల్ట్ ఇలాకాలో ఒడిశా స్ప్రింటర్‌కి శిక్షణ!

రియో ఒలింపిక్స్‌లో జమైకా చిరుత ఉసేన్ బోల్ట్‌తో ఫొటో దిగిన ఒడిశా స్ప్రింటర్ స్రబాని నందా ఇప్పుడు అతని ఇలాకాలోనే శిక్షణ పొందుతోంది.

TNN 8 Dec 2016, 6:41 pm
రియో ఒలింపిక్స్‌లో జమైకా చిరుత ఉసేన్ బోల్ట్‌తో ఫొటో దిగిన ఒడిశా స్ప్రింటర్ స్రబాని నందా ఇప్పుడు అతని ఇలాకాలోనే శిక్షణ పొందుతోంది. అవునండి.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన స్ప్రింటర్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న బోల్ట్‌ను తయారుచేసిన జమైకాలోనే ఇప్పుడు నందా శిక్షణ తీసుకుంటోంది.
Samayam Telugu odisha sprinter srabani nanda now training in usain bolt territory
ఉసేన్ బోల్ట్ ఇలాకాలో ఒడిశా స్ప్రింటర్‌కి శిక్షణ!


అస్సాంలో జరిగిన సౌత్ ఏసియన్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన స్రబాని.. ఆ తరవాత భారత్ తరఫున రియో ఒలింపిక్స్‌లో కూడా పాల్గొంది. ఒలింపిక్స్‌లో రెండుసార్లు బంగారు పతకాలు సాధించిన జమైకాకు చెందిన షెల్లీ అన్‌ఫ్రేసెర్ ప్రసీ వద్ద నందా ఇప్పుడు శిక్షణ పొందుతోంది. షెల్లీ కింగ్‌స్టన్‌లో ఎంవీపీ ట్రాక్ అండ్ ఫీల్డ్ క్లబ్‌ను నిర్వహిస్తోంది.

కాగా, 25 ఏళ్ల స్రబాని నందా 2017 మే వరకు అక్కడే శిక్షణ పొందనుంది. ఆమె వెంట కోచ్ తరుణ్ సాహా, వ్యక్తిగత ఫిజియో కూడా ఉన్నారు. ‘స్రబాని జమైకాలో శిక్షణ తీసుకుంటే బాగుంటందని నేను సూచించా, ఆమె కూడా దానికి అంగీకరించింది. దీని కోసం ఒడిశా క్రీడల మంత్రిత్వ శాఖను సంప్రదించాం. వారు సహకారాన్ని అందించారు. ఈ విధంగా అథ్లెట్‌కు ఒక రాష్ట్రం సహకారం అందించడం నేనిప్పటి వరకు చూడలేదు’ అని తరుణ్ సాహా చెప్పారు.

నందాకు కఠినమైన శిక్షణ ఇంకా ప్రారంభం కాలేదని, ఫిబ్రవరి నుంచి అది మొదలవుతుందని వెల్లడించారు. మే నెల వరకు కింగ్‌స్టన్‌లోనే ఉంటామని, స్రబాని ఆసియా మీట్‌లో పాల్గొంటుందని తెలిపారు. మరో వైపు రన్నర్ ద్యుతీ చంద్‌ను కూడా జమైకా పంపాలని ఒడిశా ప్రభుత్వం యోచిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.