యాప్నగరం

ఫుట్‌బాల్ సూపర్‌ స్టార్ క్రిస్టియానో రొనాల్డ్‌కి కరోనా పాజిటివ్

పోర్చుగల్, ఫ్రాన్స్ మధ్య సోమవారం మ్యాచ్ జరగగా.. మ్యాచ్ డ్రాగా ముగిసిన తర్వాత పోర్చుగల్ టీమ్‌ సభ్యులతో కలిసి క్రిస్టియానో రొనాల్డో సెల్ఫీ తీసుకున్నాడు. కానీ.. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

Samayam Telugu 13 Oct 2020, 10:02 pm
పోర్చుగల్ ఫుట్‌బాల్ టీమ్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డ్‌‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. యుఈఎఫ్‌ఏ నేషనల్ లీగ్‌లో పోర్చుగల్ టీమ్‌ని ముందుండి నడిపిస్తున్న క్రిస్టియానో ఇటీవల ఫ్రాన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లోనూ ఆడాడు. ఈ మ్యాచ్ ఆఖరికి డ్రాగా ముగియగా.. మ్యాచ్ ముగిసిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో రొనాల్డ్‌కి కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు పోర్చుగల్ ఫుట్‌బాల్ అసోషియేషన్ మంగళవారం అధికారికంగా ప్రకటించింది.
Samayam Telugu Cristiano Ronaldo  (AFP Photo)
Cristiano Ronaldo. (AFP Photo)


లీగ్‌లో భాగంగా స్వీడన్‌తో గురువారం పోర్చుగల్ టీమ్ తలపడాల్సి ఉండగా.. జట్టు నుంచి రొనాల్డ్‌ని తప్పించినట్లు పోర్చుగల్ ఫుట్‌బాల్ అసోషియేషన్ వెల్లడించింది. అంతేకాకుండా.. టీమ్‌ని కూడా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగటివ్ వచ్చినట్లు అసోషియేషన్ వివరించింది. రొనాల్డ్‌‌లో ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదని తెలుస్తోంది.

‘‘కరోనా పాజిటివ్‌గా తేలిన క్రిస్టియానో రొనాల్డ్‌ని పోర్చుగల్ టీమ్ నుంచి తప్పించాం. స్వీడన్‌తో మ్యాచ్‌లో అతను టీమ్‌లో ఉండడు. పోర్చుగల్ టీమ్‌లో మరెవరికీ కరోనా సోకలేదు’’ అని అసోషియేషన్ ఓ ప్రకటనని విడుదల చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.