యాప్నగరం

భార్య ఆత్మహత్య కేసులో కబడ్డీ ప్లేయర్ అరెస్టు

భార్య ఆత్మహత్య కేసులో జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారుడు రోహిత్ చిల్లార్‌ను డిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రోహిత్‌పై అదనపు కట్నం కోసం వేధింపులు కేసు నమోదు చేశారు.

TNN 21 Oct 2016, 4:11 pm
భార్య ఆత్మహత్య కేసులో జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారుడు రోహిత్ చిల్లార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రోహిత్ చిల్లార్ భార్య లలిత సోమవారం డిల్లీలోని నాగోలీస్ అశోక మెహల్లాలోని తన తల్లిదండ్రుల నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఇండియన్ నేవీలో అధికారిగా విధులు నిర్వహించే రోహిత్‌పై అదనపు కట్నం వేధింపులు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు రోహిత్‌ను ముంబైలో ఈ రోజు మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారని సౌత్ వెస్ట్ జాయింట్ కమిషనర్ దీపేంద్ర పాథక్ తెలిపారు. ఈ కేసులో రోహిత్ తండ్రి విజయ్ సింగ్ కూడా పోలీసులకు లొంగిపోయాడు. డిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్న విజయ్ సింగ్‌ను విధుల నుంచి తప్పించారు. రోహిత్ భార్య లలిత అక్టోబరు 17 న తన తల్లిదండ్రుల ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. చిన్న చిన్న విషయాలకే రోహిత్ వేధించేవాడని, తన జీవితంలో నుంచి వెళ్లిపోవాలన్నాడని ఆమె తన ఆత్మహత్య లేఖలో పేర్కొంది. లేఖతోపాటు దీనికి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగ్‌ ఆధారాలను కూడా ఆమె ఉంచింది. దీని ఆధారంగా పోలీసులు రోహిత్, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. లలిత ఆత్మహత్య చేసుకున్న తర్వాత రోహిత్ తల్లిదండ్రులు పరారీలో ఉన్నారు.
Samayam Telugu pro kabaddi player rohit chillar arrested after wifes suicide
భార్య ఆత్మహత్య కేసులో కబడ్డీ ప్లేయర్ అరెస్టు


Truth should come forward;Court’s decision will be welcomed:Pro-Kabaddi player Rohit Chillar's father on his arrest over Lalita suicide case pic.twitter.com/5F1XKc3VCp — ANI (@ANI_news) October 21, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.