యాప్నగరం

BWF World Tour Finals: చరిత్ర సృష్టించిన‌ పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే ఓ షట్లర్ బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో గెలవడం ఇదే తొలిసారి. 2011లో సైనా నెహ్వాల్, 2017లో సింధూ ఫైనల్‌కి చేరినా భారత్‌కి నిరాశే ఎదురైంది. కానీ.. తాజాగా ఫైనల్లో తలపడిన పీపీ సింధు ఎట్టకేలకి భారతీయుల కల నెరవేర్చింది.

Samayam Telugu 16 Dec 2018, 12:20 pm
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. సుదీర్ఘకాలంగా భారతీయులకి అందని ద్రాక్షగా మిగిలిపోయిన బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో ఈరోజు విజేతగా నిలిచింది. ఒకుహరతో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 21-19, 21-17 తేడాతో గెలిచిన పీవీ సింధు ఎట్టకేలకి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
Samayam Telugu emc0mj0g_pv-sindhu_625x300_23_August_18


బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో గత ఏడాది కూడా ఫైనల్‌కి చేరిన పీవీ సింధు.. అనూహ్యంగా పరాజయాన్ని చవిచూసింది. దీంతో.. ఈరోజు మ్యాచ్ ఆరంభం నుంచి పట్టుదలతో ఆడిన ఈ భారత షట్లర్ ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశమివ్వలేదు. సుదీర్ఘ ర్యాలీలతో హోరా హోరీగా సాగిన ఈ పోరులో తొలి సెట్‌ని అలవోకగా చేజిక్కించుకున్న సింధు.. రెండో సెట్‌లో కాస్త తడబడినట్లు కనిపించింది. కానీ.. ఒకుహర వరుస తప్పిదాలు చేయడంతో మళ్లీ పుంజుకున్న సింధు.. చూస్తుండగానే టైటిల్‌ని ఎగరేసుకొచ్చింది.

కెరీర్‌లో ఒకుహరతో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌ల్లో తలపడిన సింధు.. ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో గెలుపొందడం విశేషం. భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే ఓ షట్లర్ బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌‌లో గెలవడం ఇదే తొలిసారి. 2009లో గుత్తాజ్వాల- దిజు మిక్సెడ్ డబుల్స్‌ జోడీ ఈ టోర్నీ ఫైనల్‌కి చేరినా.. రజతంతోనే సరిపెట్టుకుంది. ఆ తర్వాత 2011లో సైనా నెహ్వాల్, 2017లో సింధూ ఫైనల్‌కి చేరినా.. మళ్లీ భారత్‌కి నిరాశే ఎదురైంది. కానీ.. తాజాగా మరోసారి ఫైనల్లో తలపడిన పీపీ సింధు ఎట్టకేలకి భారతీయుల కల నెరవేర్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.