యాప్నగరం

చెన్నై‌కి సింధు.. హైదరాబాద్‌కి మారిన్

ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌ (పీబీఎల్) సీజన్‌-3 వేలం పాట సోమవారం ఆసక్తికరంగా జరిగింది. వేలంలో 8 ఫ్రాంఛైజీలు పోటీపడగా

TNN 9 Oct 2017, 4:13 pm
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌ (పీబీఎల్) సీజన్‌-3 వేలం పాట సోమవారం ఆసక్తికరంగా జరిగింది. వేలంలో 8 ఫ్రాంఛైజీలు పోటీపడగా.. ఒక్కో జట్టుకి ఒక ప్లేయర్‌ని అట్టిపెట్టుకునే అవకాశం లభించింది. దీంతో చెన్నై స్మాషర్స్ జట్టు పీవీ సింధుని అట్టిపెట్టుకుంది. రియో ఒలింపిక్స్ విజేత, స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌ని హైదరాబాద్ హంటర్స్ ఫ్రాంఛైజీ రూ.50లక్షలకి దక్కించుకుంది.
Samayam Telugu pvsindhu retained by chennai smashers
చెన్నై‌కి సింధు.. హైదరాబాద్‌కి మారిన్


అవధె వారియర్స్‌ ఫ్రాంఛైజీ సైనా నెహ్వాల్‌ని, బెంగళూరు బ్లాస్టర్స్ సిక్కిరెడ్డిని అట్టిపెట్టుకోగా.. భారత డబుల్స్ క్రీడాకారిణి అశ్విన్ పొన్నప్ప‌ని రూ. 20లక్షలకి, ప్రణవ్‌ని రూ.18లక్షలకి ఢిల్లీ ఏసర్స్ దక్కించుకుంది. ముంబయి, హైదరాబాద్, లక్నో, చెన్నై, గువహటి ఈ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి. మొత్తం 11 దేశాలకి చెందిన 133 మంది క్రీడాకారులు ఈ వేలం‌లో పాల్గొన్నారు.

Here are the baddies who have been retained by their respective teams. Their retention costs will be disclosed shortly! #PBLAuction pic.twitter.com/Ii4l0u0GVF — PBL India (@PBLIndiaLive) October 9, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.