యాప్నగరం

ఒలింపిక్ స్టార్లకు ఖేల్ రత్న అవార్డులు

ఒలింపిక్స్‌లో మెరిసి దేశం పరువు ప్రతిష్టలు కాపాడిన క్రీడాకారులకు ఖేల్ రత్న అవార్డులను అందించారు రాష్ట్రపతి.

TNN 29 Aug 2016, 2:22 pm
ఒలింపిక్స్‌లో మెరిసి దేశం పరువు ప్రతిష్టలు కాపాడిన క్రీడాకారులకు ఖేల్ రత్న అవార్డులను అందించారు రాష్ట్రపతి. నేడు జాతీయ క్రీడా దినోత్సవం కావడంతో అవార్డులను సోమవారమే బహూకరించారు.
Samayam Telugu rio olympics stars honored with khel ratna awards
ఒలింపిక్ స్టార్లకు ఖేల్ రత్న అవార్డులు

ధ్యాన్ చంద్‌కు నివాళులు
రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్‌కు నివాళులు అర్పించారు రాష్ట్రపతి, ఇతర ప్రముఖులు. అనంతరం రియో ఒలింపిక్స్‌లో రజతపతకం సాధించిన పీవీ సింధు, కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్, పతకం లేకపోయినా అద్భుత ప్రదర్శన ఇచ్చిన దీపా కర్మకార్, జీతూరాయ్ లకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డులను అందించారు.
ప్రధాని మోడీని కలిసిన ఒలింపిక్స్ పతక విజేతలు
ద్రోణాచార్య అవార్డులు
దీపా కర్మాకర్‌ కోచ్‌ విశ్వశ్వర్‌ నంది, నాగపురి రమేశ్‌, సాగర్‌, రాజ్‌కుమార్‌, ప్రదీప్‌కుమార్‌, మహవీర్‌సింగ్‌లకు ద్రోణాచార్య ద్రోణాచార్య పురస్కారాలు అందుకున్నారు. రహానె, లలితా బాబర్‌, శివ థాపా, వీఆర్‌ రఘునాథ్‌, రాణీ రాంపాల్‌ సహా 15 మంది అర్జున పురస్కారాలు అందుకున్నారు. సత్తి గీత, సిల్వానస్‌ డంగ్‌ డంగ్‌, రాజేంద్ర ప్రహ్లాద్‌ షెల్కేలు ధ్యాన్‌చంద్‌ జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.