యాప్నగరం

Singapore Open 2022లో క్వార్టర్స్ చేరిన సైనా, సింధు, ప్రణయ్

Singapore Open 2022 quarterfinals లో భారత షట్లర్లు అడుగుపెట్టారు. టోర్నీలో రెండో రోజైన గురువారం ఆరంభంలో ప్రత్యర్థుల నుంచి ప్రతిఘటన ఎదరైనా.. గొప్పగా పోరాడి నెక్ట్స్ లెవల్‌కి అర్హత సాధించారు.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 14 Jul 2022, 6:43 pm
సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత షట్లర్ల జోరు రెండో రోజు కూడా కొనసాగింది. మహిళల సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో వేర్వేరు ప్రత్యర్థులతో గురువారం తలపడిన పీవీ సింధు, సైనా నెహ్వాల్.. గొప్ప పోరాట పటిమని కనబర్చి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. అలానే ఫురుషుల సింగిల్స్‌లో హెచ్ ఎస్ ప్రణయ్, డబుల్స్ జోడి ఎంఆర్ అర్జున్, ద్రువ్ కపిల కూడా క్వార్టర్స్‌ చేరింది.
Samayam Telugu Saina Nehwal, PV Sindhu
Saina Nehwal, PV Sindhu


మూడో సీడ్ పీవీ సింధు ఈరోజు వరల్డ్ నెం.59 తు లిన్ నువైన్‌తో తలపడి 19-21, 21-19, 21-18 తేడాతో విజయాన్ని అందుకుంది. మూడు సెట్లలోనూ పీవీ సింధుకి ఆరంభం నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే.. పట్టు వదలని సింధు.. ఆఖరి వరకూ పోరాడి మ్యాచ్‌ని చేజిక్కించుకుంది. అలానే వరల్డ్ నెం.19 హెచ్‌ఎస్ ప్రణయ్ ఈరోజు చైనీస్ తైపీ చౌ టైన్ చెన్‌పై 14-21, 22-20, 21-18 తేడాతో విజయాన్ని అందుకున్నాడు. ఈ ఇద్దరి మధ్య పోరు ఏకంగా 69 నిమిషాల పాటు జరిగింది.

ఆఖరిగా సైనా నెహ్వాల్ చాలా రోజుల తర్వాత మెరుగైన ఆటతీరుని కనబర్చింది. గత కొంతకాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్న సైనా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో కామన్వెల్త్ గేమ్స్ ట్రయల్స్‌కి కూడా దూరంగా ఉంది. కానీ.. ఈరోజు ప్రీక్వార్టర్‌లో ఆమె చైనీస్ వరల్డ్ నెం.9 హి బింగ్ జియావోపై 21-19, 11-21, 21-17 తేడాతో విజయాన్ని అందుకుంది.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.