యాప్నగరం

సాక్షి మాలిక్ పెళ్లాడబోయేది ఇతన్నే

రియో ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలిచి రెజ్లర్ సాక్షి మాలిక్.. దేశవ్యాప్త గుర్తింపును తెచ్చుకుంది.

TNN 6 Sep 2016, 8:59 am
రియో ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలిచి రెజ్లర్ సాక్షి మాలిక్.. దేశవ్యాప్త గుర్తింపును తెచ్చుకుంది. హర్యానాకు చెందిన ఈ అమ్మాయికిగా భారీగా నగదు బహుమతులు కూడా అందాయి. సచిన్ చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కారు కూడా అందుకుంది. కాగా ఇటీవల తన రాష్ట్రంలో ప్రముఖ పత్రికలకి ఇంటర్య్వూలు ఇస్తూ తన పెళ్లి గురించి వ్యాఖ్యలు చేసింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటున్న సంకేతాలను ఇచ్చి... తరువాతి ఒలింపిక్స్ కి పెళ్లి ఏమాత్రం అడ్డుకాబోదని చెప్పింది. కాబోయే భర్త ఎవరనేది మాత్రం సీక్రెట్ అంది. ఆ సీక్రెట్ ను సాక్షి అన్నే బహిర్గతం చేశాడు. సాక్షి పెళ్లి చేసుకునేది కూడా రెజ్లర్‌నే. పేరు సత్యవ్రత్ కడియన్. ఇతను అంతర్జాతీయ స్థాయి ఆటగాడు. వయసు 22. సాక్షి కన్నా రెండేళ్లు చిన్న. రియో ఒలింపిక్స్ కు ముందే వీరి వివాహ నిశ్చితార్థం జరిగిందట. త్వరలోనే వీరి పెళ్లి భాజా మోగనుంది. అన్నట్టు సత్యవ్రత్ తండ్రి సత్యవన్ కూడా రెజ్లరే. అతనికి హర్యానాలోని రోహతక్ లో ఓ అకాడమీ కూడా ఉంది.
Samayam Telugu sakshi malik will marry to sathyavrat
సాక్షి మాలిక్ పెళ్లాడబోయేది ఇతన్నే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.