యాప్నగరం

అమిత్ విసిరితే పతకం ఖాయం

ఆయనో జాతీయ స్థాయి హాకీ క్రీడాకారుడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడాలని, భారత్‌కు ప్రాతినిథ్యం వహించాలని కలలుగన్నాడు.

TNN 5 Sep 2016, 4:04 pm
ఆయనో జాతీయ స్థాయి హాకీ క్రీడాకారుడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడాలని, భారత్‌కు ప్రాతినిథ్యం వహించాలని కలలుగన్నాడు. కానీ విధి వెక్కిరించింది, ప్రమాదం రూపంలో అతని కలలను నాశనం చేసింది. అయిన్పటికీ ఆయన తొణకలేదు. అదే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాడు. దేశం గర్వించదగిన పారా అథ్లెట్‌గా ఎదిగాడు. ఆయనే.. అమిత్ కుమార్ సరోహ. వీల్‌చైర్‌లో కూర్చునే డిస్కస్ త్రో, క్లబ్ త్రోలో అద్భుత విజయాలు సాధించాడు. దేశానికి ఎన్నో పతకాలు అందించాడు. సెప్టెంబర్ 7 నుంచి మొదలవుతున్న రియో పారాలంపిక్స్ లో పాల్గొంటున్న అమిత్ గురించి మరిన్ని విషయాలు తెలుకుందాం.
Samayam Telugu saroha enters the paralympics on a confident note
అమిత్ విసిరితే పతకం ఖాయం

అమిత్‌కు 2007లో తన 22వ ఏట కారు ప్రమాదం జరిగింది. ఆయన ఇక నడవలేరని, వీల్‌చైర్‌కే పరిమితం కావాలని డాక్టర్లు స్పష్టం చేశారు. కానీ అమిత్ బయపడలేదు. అమెరికా వీల్‌చైర్ రగ్బీ ఆటగాడు జొనాధన్ సిగ్వర్త్ నుంచి స్పూర్తి పొందిన అమిత్.. తన సొంతం రాష్ట్రం హర్యానా నుంచి పారా అథ్లెట్‌గా ఎదిగాడు. అంతే కాదు భారత ప్రభుత్వం నుంచి అర్జున అవార్డును కూడా అందుకున్నాడు. 2010 ఆసియా పారా గేమ్స్ లో డిస్కస్ త్రోలో రజతం సాధించిన అమిత్.. 2012లో కౌలాలంపూర్‌లో జరిగిన ఒలంపిక్ అర్హత క్రీడల్లో స్వర్ణ పతకం గెలవడంతో పాటు ఆసియా రికార్డును నెలకొల్పాడు. లండన్ ఒలంపిక్స్ డిస్కస్ త్రోలో పోటీపడ్డ 12 మంది ఆటగాళ్లలో అమిత్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు.
ప్రస్తుతం ఆయన రియో పారాలంపిక్స్ లో పాల్గోనున్నాడు. ఈ ఏడాది జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ లో బంగారు పతకం సాధించాడు. డిస్క్ ను 26.58 మీ. విసిరి ఆసియా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం అమిత్ ఫామ్‌ను పరిశీలిస్తే.. రియోలో పతకం ఖాయంగా కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.