యాప్నగరం

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో అక్కాచెల్లెళ్ల పోరు

నల్లకలువలు సెరెనా, వీనస్ విలియమ్స్.. ఆస్ట్రేలియన్ ఓపెన ఫైనల్ చేరారు.

TNN 26 Jan 2017, 2:06 pm
అమెరికన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ చేరింది. ఇప్పటి వరకూ ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించిన సెరెనా వీలియమ్స్ క్రొయేషియాకు చెందిన మిర్జానా లుసిక్ బరోనిని సెమీఫైనల్లో 6-2 6-1 తేడాతో చిత్తుగా ఓడించింది. సెరెనా ఫైనల్లో తన సోదరి వీనస్‌తో పోటీ పడనుంది. సెరెనా విలియమ్స ఖాతాలో ఇప్పటికే 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు ఉండగా.. ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గితే ఆమె ఖాతాలో రికార్డు స్థాయిలో 23 గ్రాండ్ స్లామ్‌లు చేరతాయి. 36 ఏళ్ల వీనస్ విలియమ్స్ 6-7 6-2 6-3 తేడాతో కోకో వాండెవెఘె‌ను సెమీఫైనల్లో ఓడించి ఫైనల్ చేరింది.
Samayam Telugu serena williams and vinus williams in aus open final
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో అక్కాచెల్లెళ్ల పోరు


2003 తర్వాత వీనస్ ఆస్ట్రేలియన్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఆమె ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేదు. మార్టినా నవత్రిలోవా తర్వాత గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్ చేరిన అతి పెద్ద వయస్కురాలైన క్రీడాకారిణిగా వీనస్ రికార్డు నెలకొల్పింది. 2008లో వింబుల్డన్ నెగ్గిన తర్వాత వీనస్ ఇప్పటి వరకూ ఒక్క గ్రాండ్‌స్లామ్ కూడా గెలవలేకపోయింది. అక్కాచెల్లెళ్లు ఇప్పటి వరకూ ఎనిమిదిసార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరగా.. ఆరుసార్లు చెల్లెలు సెరెనానే విజయం సాధించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.