యాప్నగరం

బాయ్‌ఫ్రెండ్‌తో సెరెనా విలియమ్స్ ఎంగేజ్‌మెంట్

అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతోంది.

TNN 30 Dec 2016, 12:39 pm
అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతోంది. 35 ఏళ్ల ఈ నల్ల కలవు తన బాయ్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్ కూడా చేసేసుకుంది. సాన్‌ఫ్రాన్సిస్కో నుంచి పనిచేస్తున్న రెడిట్ సంస్థ సహ యజమాని, వ్యాపారవేత్త అలెక్సిస్ ఒహానియన్‌తో గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) సెరెనా నిశ్చితార్థం జరిగింది. ఈ మేరకు అలెక్సిస్ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని ఖరారు చేసారు. ప్రస్తుతం సెరెనా, అలెక్సిస్.. రోమ్ నగరంలో విహరిస్తున్నారు.
Samayam Telugu serena williams engaged to reddit co founder alexis ohanian
బాయ్‌ఫ్రెండ్‌తో సెరెనా విలియమ్స్ ఎంగేజ్‌మెంట్


కాగా, అలెక్సిస్ ఒహానియన్‌తో తనకు నిశ్చితార్థం జరగనున్నట్లు మొదట సెరెనా ప్రకటించింది. ఈ విషయాన్ని రెడిట్ వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించింది. సెరెనా, ఒహానియన్ 2015 నుంచి డేటింగ్ చేస్తున్నారు. అయితే వీరిపై మీడియా కన్ను పడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. వీరిద్దరికీ సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో సెరెనా ఒక్క ఫొటో కూడా షేర్ చేయలేదంటే ఎంత గోప్యత వహించారో తెలుస్తోంది. ఇప్పుడు అకస్మాత్తుగా నా ఎంగేజ్‌మెంట్ అయిపోయింది అని సెరెనా ప్రకటించడంతో ఆశ్చర్యపోవడం అందరివంతయింది.

సెరెనా, అలెక్సిస్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఒక ట్వీట్ చేసింది.
Congrats to @SerenaWilliams and @AlexisOhanian on their engagement! 💍 💑 pic.twitter.com/mRVchROPx9 — WTA (@WTA) December 29, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.