యాప్నగరం

ఈరోజు నుంచే బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌

ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ ఈరోజు నుంచే మొదలవనుంది. చైనాలోని నాన్‌జింగ్ వేదికగా ప్రారంభంకానున్న ఈ

Samayam Telugu 30 Jul 2018, 7:38 am
ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ ఈరోజు నుంచే మొదలవనుంది. చైనాలోని నాన్‌జింగ్ వేదికగా ప్రారంభంకానున్న ఈ టోర్నీలో భారత్‌ నుంచి స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ తదితరులు పోటీపడనున్నారు. బ్యాడ్మింటన్‌లోనే అత్యున్నత టోర్నీగా గుర్తింపు పొందిన ఈ టోర్నీలో భారత్‌కి ఇప్పటి వరకు ఒక్క స్వర్ణం కూడా లభించలేదు.
Samayam Telugu 65185885


1983‌లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌‌లో దిగ్గజ షట్లర్ ప్రకాశ్ పదుకొణె కాంస్య పతకంతో భారత్‌ని మురిపించారు. అనంతరం సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఈ టోర్నీలో మెరిశారు. 2013, 2014లో వరుసగా రెండు సార్లు టోర్నీలో సత్తాచాటిని సింధు.. ఆఖరికి కాంస్యంతోనే సరిపెట్టగా.. 2017లో మాత్రం రజతాన్ని కైవసం చేసుకుంది. మరో షట్లర్ సైనా నెహ్వాల్ 2015లో రజతం, 2017లో కాంస్యంతో మెరిసింది. భారత్ తరఫున ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఇవే మెరుగైన ప్రదర్శనలు. ఈ నేపథ్యంలో.. కనీసం ఈసారైనా స్టార్ షట్లర్లు భారత్‌కి స్వర్ణం అందిస్తారేమో.. చూడాలి..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.