యాప్నగరం

కిదాంబి శ్రీకాంత్‌‌కు డిప్యూటీ కలెక్టర్‌ హోదా

భారత షట్లర్‌, తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌కు ఏపీ ప్రభుత్వం సమున్నత హోదా కల్పించింది. అతడికి డిప్యూటీ కలెక్టర్‌ హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శనివారం (డిసెంబర్ 2) బిల్లుకు ఆమోదం తెలిపింది.

TNN 2 Dec 2017, 3:10 pm
భారత షట్లర్‌, తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌కు ఏపీ ప్రభుత్వం సమున్నత హోదా కల్పించింది. అతడికి డిప్యూటీ కలెక్టర్‌ హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శనివారం (డిసెంబర్ 2) బిల్లుకు ఆమోదం తెలిపింది. ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధుకు కూడా ఏపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ హోదా కల్పించిన సంగతి తెలిసిందే. కిదాంబి శ్రీకాంత్‌ స్వస్థలం గుంటూరు. శ్రీకాంత్‌ ఈ ఏడాది తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా ప్రపంచ పురుషుల సింగిల్స్‌లో ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకి సత్తా చాటాడు. డిసెంబరు 13 నుంచి 17 వరకు దుబాయ్‌లో జరగనున్న బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.
Samayam Telugu star shuttler kidambi srikanth offered deputy collector job in andhra pradesh
కిదాంబి శ్రీకాంత్‌‌కు డిప్యూటీ కలెక్టర్‌ హోదా


శ్రీకాంత్‌ ఈ ఏడాది 4 సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ను కైవసం చేసుకున్నాడు. జూన్‌లో ఇండోనేషియా ఓపెన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గిన శ్రీకాంత్‌ అక్టోబరులో డెన్మార్క్‌ ఓపెన్‌, ఆ తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ నెగ్గి ఒకే ఏడాది నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అసాధారణ ప్రతిభతో దూసుకెళుతున్న శ్రీకాంత్‌‌కు ఏపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ హోదాతో గౌరవించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.