యాప్నగరం

ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా సునీల్ ఛెత్రీ

భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2017గా ఎంపిక చేసింది.

Samayam Telugu 23 Jul 2018, 1:11 pm
Samayam Telugu sunil chhetri
భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2017గా ఎంపిక చేసింది. కమలాదేవిని విమెన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. బైచూంగ్ భూటియా తర్వాత 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రెండో భారత ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఛెత్రీ రికార్డ్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఫుట్‌బాల్ ఆటగాళ్లలో అత్యధిక గోల్స్ సాధించిన మూడో ఆటగాడిగా ఛెత్రీ నిలిచాడు. 102 మ్యాచ్‌లు ఆడిన ఛెత్రీ 64 గోల్స్ సాధించాడు.

నాలుగు దేశాల ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో సత్తా చాటిన యువ ఆటగాడు అనిరుధ్ థాపాను ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఏఐఎఫ్ఎఫ్ ప్రకటించింది. ఈ పంథోయ్‌ను విమెన్ ఎమర్జింగ్ ప్లేయర్‌గా ఎంపిక చేసింది. బెస్ట్ రిఫరీగా సీఆర్ శ్రీకృష్ణ, బెస్ట్ అసిస్టెంట్ రిఫరీగా సుమంత దత్తాలను ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.