యాప్నగరం

తెలుగు జిమ్నాస్ట్ అరుణకి రూ.2 కోట్ల నజరానా..!

జిమ్నాస్టిక్ ప్రపంచకప్‌లో భారత్‌కి కాంస్య పతకం అందించిన తెలుగు జిమ్నాస్ట్ బుడ్డా అరుణ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం భారీ

TNN 5 Mar 2018, 9:45 am
జిమ్నాస్టిక్ ప్రపంచకప్‌లో భారత్‌కి కాంస్య పతకం అందించిన తెలుగు జిమ్నాస్ట్ బుడ్డా అరుణ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. అరుణ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఆదివారం కలిసింది. ఈ సందర్భంగా అరుణని అభినందించిన కేసీఆర్‌.. రూ. 2 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఇలానే మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
Samayam Telugu telangana cm kcr announces rs 2 cr for gymnast aruna reddy
తెలుగు జిమ్నాస్ట్ అరుణకి రూ.2 కోట్ల నజరానా..!


ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో గత వారం జరిగిన జిమ్నాస్టిక్ ప్రపంచకప్‌లో అరుణ 13.469 పాయింట్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ ప్రపంచకప్‌కి మొత్తం 16 దేశాల నుంచి అథ్లెట్స్‌ ప్రాతినిథ్యం వహించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తరఫున క్రీడా శాఖ మంత్రి పద్మారావు రూ. 20 లక్షలు నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.