యాప్నగరం

అయ్యో.. పీవీ సింధుని ఎంత మాటన్నారు!

2016 రియో ఒలంపిక్స్‌లో ఇండియాకు సిల్వర్ మెడల్ సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు పేరు దేశవ్యాప్తంగా...

TNN 18 Feb 2017, 1:48 pm
2016 రియో ఒలంపిక్స్‌లో ఇండియాకు సిల్వర్ మెడల్ సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అందులోనూ సింధు మన తెలుగు అమ్మాయి కావడంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెకు నగదు ప్రోత్సాహకాలతోపాటు ఇతర నజరానాలు అందించి సత్కరించాయి. సింధు సాధించిన ఈ విజయం ఆమెనే కాకుండా ఆమె ఆడిన బ్యాడ్మింటన్ క్రీడ పట్ల సైతం ఆదరణ పెరిగేలా చేసింది.
Samayam Telugu telangana deputy cm mahmood ali and aimim mla calls pv sindhu as a vollyball player
అయ్యో.. పీవీ సింధుని ఎంత మాటన్నారు!


ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న పీవీ సింధుకి తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో చేదు అనుభవం ఎదురైంది. సింధు అంటే బ్యాడ్మింటన్ ప్లేయర్‌గానే పరిచయం వున్న ఈ క్రీడాకారిణిని వాలీబాల్ ప్లేయర్ అని సంబోధించి స్వయంగా ఆమె బిత్తరపోయేలా చేశారు మన ప్రజాప్రతినిధులు.

అవును, విన్నారు కదా.. ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన తాను ఇప్పుడిలా వాలీబాల్ ప్లేయర్‌ని అయిపోయానే అనుకున్నారో ఏమో కానీ ఆ మాటలు వింటూ కూడా ఏమీ స్పందించకుండా ఆమె అలా వుండిపోయారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ పాత బస్తీలో ఏర్పాటు చేసిన 5 కే రన్ ఈవెంట్ ఈ సన్నివేశానికి వేదికైంది.

ఈ ఈవెంట్‌ని సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతున్న క్రమంలో ఏఐఎంఐఎం పార్టీ నేత, యాకుత్‌పుర ఎమ్మెల్యే అయిన ముంతాజ్ ఖాన్ సింధుని వాలీబాల్ ప్లేయర్ అని సంబోధించారు. అయితే, అంతకన్నా ముందు ఆయన తన పక్కనే వున్న తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీని ఆమె గురించి అడిగి తెలుసుకోవడం గమనార్హం. పీవీ సింధుని వాలీబాయ్ ప్లేయర్ అని సంబోధించింది ముంతాజ్ ఖాన్ అయినప్పటికీ ... ఆయనకి ఆమె గురించి అలా సూచించింది మాత్రం డిప్యూటీ సీఎం అలీనే అని ఈ వీడియో చూస్తే అర్థమవుతోందంటున్నారు ఈ వీడియో చూసినవాళ్లు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.