యాప్నగరం

హాంకాంగ్ ఓపెన్ నుంచి సైనా ఔట్

భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ హాంకాంగ్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది.

TNN 25 Nov 2016, 7:14 pm
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ హాంకాంగ్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో హాంకాంగ్ క్రీడాకారిణి చెవాంగ్ నాన్ యి చేతిలో 8-21, 21-18, 19-21 తేడాతో సైనా ఓడిపోయింది. క్లిష్టమైన మోకాలి గాయం నుంచి కోలుకున్న తరవాత సైనా ఆడిన తొలి సిరీస్ ఇది.
Samayam Telugu valiant saina nehwal bows out of hong kong open
హాంకాంగ్ ఓపెన్ నుంచి సైనా ఔట్


తొలి గేమ్‌ను 8-12 తేడాతో 12 నిమిషాల్లోనే కోల్పోయిన సైనా రెండో గేమ్‌ను మాత్రం 21-18తో చేజిక్కుంచుకుంది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఈ ప్రపంచ నంబర్ వన్ తలవంచింది. 19-21 తేడాతో ఓటమి పాలయ్యంది. దీంతో హాంకాంగ్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. సైనాపై నెగ్గిన చెవాంగ్ నాన్ శనివారం జరిగే సెమీ ఫైనల్లో మరో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుతో తలపడుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.