యాప్నగరం

షూటింగ్‌లో భారత్‌కి మరో రెండు కాంస్యాలు..!

వ్యక్తిగత విభాగంలో 113 పాయింట్లతో ఫైనల్‌కి చేరిన వివాన్.. తుదిపోరులోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఆ తర్వాత ముగ్గురు షూటర్ల

Samayam Telugu 23 Mar 2018, 3:33 pm
సిడ్నీ వేదికగా జరుగుతున్న జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ పతకాల వేట కొనసాగిస్తోంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇప్పటికే భారత మహిళా షూటర్ ఎలవెనిల్ చరిత్ర సృష్టిస్తూ.. ప్రపంచ రికార్డుతో స్వర్ణాన్ని గెలుపొందగా.. శుక్రవారం యువ షూటర్ వివాన్ కపూర్ రెండు కాంస్య పతకాలను భారత్‌కి అందించాడు. దీంతో టోర్నీలో పతకాల జాబితాలో భారత్ రెండు స్వర్ణాలు, మూడు కాంస్యాలతో రెండో స్థానానికి ఎగబాకింది. తొలి స్థానంలో చైనా (ఐదు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యం ) ఉంది.
Samayam Telugu 63428216


వ్యక్తిగత విభాగంలో 113 పాయింట్లతో ఫైనల్‌కి చేరిన వివాన్.. తుదిపోరులోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఆ తర్వాత ముగ్గురు షూటర్ల బృందంతో జరిగిన పోటీలోనూ భారత్‌ కాంస్యం గెలవడంలో వివాన్ కీలక పాత్ర పోషించాడు. గురువారం యువ షూటర్ ఎలవెనిల్‌ కూడా ఫైనల్లో 249.8 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకోగా.. క్వాలిఫయింగ్‌లో ఆమె 631.4 పాయింట్లతో ప్రపంచ రికార్డును తిరగరాసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.