యాప్నగరం

స్పెయిన్‌కు డేవిస్ కప్ అందించిన నాదల్

ప్రతిష్టాత్మక డేవిస్ కప్‌ను స్పెయిన్ ఆరోసారి కైవసం చేసుకుంది. ప్రపంచ నం.1 సింగిల్స్ టెన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్ ఏకపక్ష విజయాలతో జట్టుకు ఒంటిచేత్తో కప్‌ను అందించాడు.

Samayam Telugu 25 Nov 2019, 11:33 am

ప్రధానాంశాలు:

  • నాదల్ చలవతో డేవిస్ కప్ నెగ్గిన స్పానిష్ టీమ్
  • ఫైనల్లో కెనడాపై 2-0తో తిరుగులేని విజయం
  • సింగిల్స్, డబుల్స్‌లో అజేయంగా నిలిచిన నాదల్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Madrid: Spains Rafael Nadal returns the ball against Croatias Borna Gojo duri...
ప్రపంచ నం.1 రఫెల్ నాదల్ (స్పెయిన్) ఈ ఏడాదిని ఘనంగా ముగించాడు. సొంతదేశానికి ప్రతిష్టాత్మక డేవిస్ కప్‌ను అందించాడు. సొంతగడ్డ మాడ్రిడ్‌లో భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఫైనల్లో స్పెయిన్ 2-0తో కెనడాపై వన్‌సైడ్ విక్టరీని నమోదు చేసింది.

Read Also: ఎదురే లేని నాదల్
తొలి రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో స్పెయిన్ ప్లేయర్లు గెలుపొందడటంతో డబుల్స్ మ్యాచ్ అవసరం లేకుండానే స్పానిష్ టీమ్ విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో సూపర్ ఫామ్‌లో ఉన్న నాదల్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ గెలవడం విశేషం. మరోవైపు ఈ టోర్నీలో గెలుపొందిన స్పెయిన్‌కు 2.1 మిలియన్ డాలర్ల (15 కోట్ల రూపాయలు) ప్రైజ్‌మనీ లభించింది

Read Also: ధోనీని దాటేసిన కోహ్లీ.. పింక్ బాల్ టెస్టులో రికార్డుల మోత


ఫైనల్లో నాదల్ 6-3, 7-6 (9/7)తో డెనిస్ షపలోవ్‌పై సునాయాస విజయం సాధించాడు. దాదాపు రెండుగంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏడు భారీ ఏస్‌లు, 24 విన్నర్లతోపాటు కీలక సమయంలో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి స్పానిష్ స్టార్ విజయం సాధించాడు.

Read Also: ఇషాంత్ ప్రత్యేకమైన బౌలర్: పుజారా

అంతకుముందు జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో రాబర్ట్ బటిస్టా ఆగట్ 7-6 (7/3), 6-3తో ఫెలిక్స్ ఆగర్‌పై కాస్త శ్రమించి గెలుపొందాడు. మొత్తం మీద నాదల్.. తన కెరీర్‌లో నాలుగు డేవిస్ కప్ టైటిల్స్‌ విజయాల్లో పాలుపంచుకున్నాడు. 2004, 2009, 2011లలోనూ డేవిస్ కప్ గెలిచిన స్పెయిన్ టీమ్‌లో నాదల్ సభ్యునిగా ఉన్నాడు.

Read Also: వరల్డ్ నం.1 ఆట చూపించిన నాదల్

మరోవైపు ఈ ఏడాదిని ఇలా అద్భుత విజయంతో ముగించడం ఆనందంగా ఉందని నాదల్ పేర్కొన్నాడు. ఈ ఏడాది మునుపటి ఫామ్‌ను దొరకబుచ్చుకున్న నాదల్ ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్‌లను కైవసం చేసుకోవడంతోపాటు వరల్డ్ నం.1 ర్యాంకును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.